RRR: పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ మల్టీస్టారర్ గా వస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్‘. పైగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ హిందీలో స్టార్ హీరో. అలియా నంబర్ వన్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్. మరి, వీళ్లకు ఏ లెక్కన రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు ? సినిమాకి 400 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ఇక దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి రెమ్యునరేషన్ కూడా హీరోల కంటే ఎక్కువే ఉండి ఉంటుంది.
ఈ లెక్కలన్నీ చూసుకుంటే.. అసలు ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇప్పటిదాకా అయిన బడ్జెట్ ఎంత ? ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి రెమ్యునరేషన్ వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ క్రింద విధంగా ఉన్నాయి.
Jr.Ntr Remuneration for RRR:
ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 47 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ 32 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. అయితే, ఆర్ఆర్ఆర్ కోసం అదనపు డేట్లు కేటాయించాడు కాబట్టి.. 47 కోట్లు ఇచ్చారట. ఎన్టీఆర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. రాబోయే సినిమాలకు కూడా తారక్ ఇలాగే తీసుకునే అవకాశం ఉంది.
Ram charan Remuneration for RRR:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంది ఈ సినిమాకే. మొత్తంగా 44 కోట్ల వరకు తీసుకున్నాడట. చరణ్ కి ఎన్టీఆర్ కంటే మూడు కోట్లు తక్కువ ఇచ్చారని తెలుస్తోంది. అంతకు ముందు హీరోలకు ఉన్న మార్కెట్ ను బట్టి అంచనా వేసి జక్కన్న రెమ్యునరేషన్స్ ను ఫిక్స్ చేశాడట.
అలియా రెమ్యునరేషన్ విషయానికి వస్తే.
ఆమెకు ఈ సినిమాకు గాను 9 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారు. నిజానికి అలియా బాలీవుడ్ సినిమా గానూ కేవలం 6 కోట్లు మాత్రమే తీసుకుంటుంది. కానీ ఈ సినిమాకి ఆమెకు అదనపు పారితోషికం ఇచ్చారు. కారణం.. ప్రమోషన్స్ లో కూడా పాల్గొనాలి అనే షరతు మీద ఆమెకు అంత ఇవ్వడం జరిగింది.
Also Read: Tollywood: 2021 రౌండప్ : ఈ ఏడాది భారీ డిజాస్టర్స్ ఇవే !
అజయ్ దేవ్ గన్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.
అజయ్ దేవ్ గన్ రెమ్యునరేషన్ విషయంలో ఆర్ఆర్ఆర్ టీమ్ చాలా రిస్క్ చేసింది. అజయ్ దేవగన్ కి 26 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారు. అసలు ఆర్ఆర్ఆర్ అజయ్ దేవగన్ కేవలం అతిథి పాత్ర. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవ్ గన్ కి ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని 25 కోట్ల వరకు ఇచ్చారు.
ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు 450 కోట్లు ఖర్చు అయిందట. అలాగే 30 కోట్లు వరకు ప్రమోషన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు.
Also Read: Tollywood: 2021 ఇయర్ రౌండప్ : టాలీవుడ్ కి ఊపు తెచ్చిన సినిమాలివే !