https://oktelugu.com/

Samantha Ruth Prabhu : ఫైనల్లీ నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడు… సమంత షాకింగ్ పోస్ట్!

విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్నా సమంత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. థర్టీ ప్లస్ లో ఉన్న సమంత వివాహం చేసుకునేందుకు ఇదే రైట్ ఏజ్.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2023 / 10:36 AM IST

    Samantha Ruth Prabhu

    Follow us on

    Samantha Ruth Prabhu : సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడంటూ కామెంట్ పెట్టింది. సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. న్యూయార్క్ నగరంలో చక్కర్లు కొడుతుంది. సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లారని సమాచారం. కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. ఈ అరుదైన వ్యాధికి శాశ్వత చికిత్స కోసం అమెరికా వెళ్ళింది. చికిత్సకు ముందు ఆమె మానసికంగా సిద్ధం అవుతుంది.

    ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తుంది. సన్నిహితులను కలుస్తుంది. ఇక తన అమెరికన్ టూర్ ఫోటోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. సమంత తాజాగా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడని పోస్ట్ పెట్టింది. సమంత కాఫీ బాగా ఇష్టపడతారట. ఓ పెద్ద సైజ్ కప్పులో కాఫీ తాగుతూ… తనను అర్థం చేసుకున్నారని కామెంట్ పెట్టింది. సమంత క్యాప్షన్ డబుల్ మీనింగ్ కి దారితీసింది. ఒంటరిగా ఉన్న సమంత జంట దొరికింది అన్నట్లు ఈ కామెంట్ ఉంది. అయితే సమంత కాఫీని ఉద్దేశిస్తూ ఆ కామెంట్ చేసింది.

    సమంత భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ లో అధికారికంగా ప్రకటన చేశారు. విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్నా సమంత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు. థర్టీ ప్లస్ లో ఉన్న సమంత వివాహం చేసుకునేందుకు ఇదే రైట్ ఏజ్. అయితే ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రచారం జరుగుతుంది. సమంత తల్లి బలవంతం చేస్తున్నా చేసుకోనని అంటున్నారు. ఆ మధ్య సద్గురు జగ్గీ వాసుదేవ్ సమంతకు అబ్బాయిని చూశాడనే ప్రచారం జరిగింది.

    ఇక సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ప్రోమోలు చూస్తే అర్థం అవుతుంది. సాంగ్స్ కూడా ఆకట్టుకోగా ఖుషి చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. మంచి ఓపెనింగ్స్ దక్కే సూచనలు కలవు.