https://oktelugu.com/

Samantha – Varun Dhawan : వరుణ్ ధావన్ తో సమంత శృంగారం… క్లారిటీ వచ్చేసింది!

ఫ్యామిలీ మాన్ వన్ అండ్ టు, ఫార్జీ సిరీస్లలతో సక్సెస్ ఫుల్ డుయోగా వేరు పేరుతెచ్చుకున్నారు. మరోవైపు సమంత విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ విడుదల కానుంది. 

Written By:
  • Shiva
  • , Updated On : May 23, 2023 / 12:16 PM IST
    Follow us on

    Samantha – Varun Dhawan : సమంత సిటాడెల్ సిరీస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇంగ్లీష్ వెర్షన్ లో నటించారు. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ ఏప్రిల్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రియాంక సహనటుడు రిచర్డ్ మ్యాడెన్ తో శృంగార సన్నివేశాల్లో నటించారు. కథలో భాగంగా ప్రియాంక-రిచర్డ్ మధ్య బోల్డ్ సన్నివేశాలు తెరకెక్కించారు. 

     
    ఈ సన్నివేశాల గురించి ప్రియాంక మాట్లాడారు. బెడ్ రూమ్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బంది పడ్డట్లు వెల్లడించారు. చేతులతో ప్రైవేట్ పార్ట్స్ దాచుకోవాల్సి వచ్చింది. రిచర్డ్ నాకు సహాయం చేశారు. శరీరం కనిపించకుండా ఉండేందుకు ఏం చేయాలో సలహాలు ఇచ్చాడు. రిచర్డ్ సహకారంతో ఆ సన్నివేశాలు పూర్తి చేయగలిగాను… అన్నారు. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో ప్రియాంక-రిచర్డ్ పాత్రలను సమంత-వరుణ్ ధావన్ చేస్తున్నారు. 
     
    ఈ క్రమంలో సమంత-వరుణ్ మధ్య కూడా బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయి. సమంత వస్త్రాలు లేకుండా శృంగార సన్నివేశాల్లో కనిపించనున్నారని కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఓ స్పష్టత వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమంత-వరుణ్ లపై బోల్డ్ సీన్స్ లేవు. ఇండియన్ వెర్షన్ ఇంటర్నేషనల్ వెర్షన్ కి భిన్నంగా ఉంటుంది. కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రియాంక వలె సమంతపై ఇంటిమసీ సీన్స్ తెరకెక్కించడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో సమంత అభిమానులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. 
     
    గతంలో సమంత నటించిన ది ఫ్యామిలీ మాన్ 2లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. బోల్డ్ సీన్స్ లో సమంత నటించారు. ఆ అనుభవం రీత్యా సిటాడెల్ లో ఆమె మరోసారి రెచ్చిపోయి ఉంటారని పలువురు భావించారు. సిటాడెల్ సిరీస్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ వన్ అండ్ టు, ఫార్జీ సిరీస్లలతో సక్సెస్ ఫుల్ డుయోగా వేరు పేరుతెచ్చుకున్నారు. మరోవైపు సమంత విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ విడుదల కానుంది.