Homeఎంటర్టైన్మెంట్Samantha Second Marriage: బాధితురాలు కాదు విలన్... సమంతపై ఆమె పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సంచలన...

Samantha Second Marriage: బాధితురాలు కాదు విలన్… సమంతపై ఆమె పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సంచలన కామెంట్స్

Samantha Second Marriage: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిన్న ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రాజ్ నిడిమోరు(Raj Nidimoru) ని వివాహం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియా లో ఎలాంటి నెగిటివిటీ వచ్చిందో, సమంత రెండవ పెళ్లి కి అంతకు రెండు రెట్లు ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. మరోపక్క ఆమె అభిమానులు ఇప్పటికైనా సమంత కి ఒక మంచి తోడు దొరికినందుకు ఎంతో సంతోషిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదంతా పక్కన పెడితే సమంత కి మొదటి నుండి మేకప్ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చిన సాధన సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘ అసలైన విలన్ విక్టిమ్ గా ఇన్ని రోజులు బాగానే నటించారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ స్టోరీ సరిగ్గా సమంత పెళ్లి చేసుకున్న రోజే ఈమె ఎందుకు పెట్టింది?, ఇది ఆమె సమంత ని ఉద్దేశించి పెట్టిందా? , లేకపోతే సమంత కి సపోర్టుగా పెట్టిందా?. సమంత కి నెగిటివ్ గా ఈ పోస్ట్ పెట్టే అవకాశాలు చాలా తక్కువ. ఇది కచ్చితంగా ఆమె రాజ్ నిడిమోరు మాజీ భార్య ని ఉద్దేశించి పుట్టినదే అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామిలిదే అప్పుడప్పుడు సమంత, రాజ్ లను ఉద్దేశిస్తూ పరోక్ష సెటైర్లు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో పెడుతూ ఉంటుంది. సమంత రెండవ పెళ్లి రోజు ఆమె ‘ కాలం అన్నింటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది’ అంటూ కామెంట్ చేసింది. కచ్చితంగా సాధన సింగ్ దీనికి కౌంటర్ గానే ఈ స్టోరీ పెట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మరి కొంతమంది అయితే ఈమధ్య కాలం లో సాధన సింగ్, సమంత కి మధ్య గొడవలు అయ్యాయి అని, ప్రస్తుతానికి వీళ్లిద్దరు దూరంగానే ఉంటున్నారని, కాబట్టి కచ్చితంగా ఇది సమంత ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని అంటున్నారు. కానీ ఇప్పుడు సమంత ఎలాంటి విక్టిమ్ కార్డు ప్లే చెయ్యలేదు. కేవలం పెళ్లి చేసుకున్న ఫోటోలను మాత్రమే అప్లోడ్ చేసింది. కాబట్టి ఇది ఆమెకు కౌంటర్ అంటే నమ్మే అవకాశాలు చాలా తక్కువ. కచ్చితంగా ఈ కౌంటర్ శ్యామిలీ కి ఇచ్చింది, లేదంటే ఆమె వ్యక్తిగత జీవితం లో ఉన్న మరో వ్యక్తికి కౌంటర్ అయ్యుండొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version