Naga Chaitanya: హీరో నాగ చైతన్య మొదటిసారి డిజిటల్ సిరీస్ చేస్తున్నారు. దూత స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 1 నుండి ఇది స్ట్రీమ్ కానుంది. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గ దూత తెరకెక్కింది. దూత ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. దూత సిరీస్ తో అక్కినేని హీరో కొత్త ఇమేజ్ ఆశిస్తున్నాడు. దూత సిరీస్ కి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. గతంలో విక్రమ్ కె కుమార్-నాగ చైతన్య కాంబోలో విడుదలైన మనం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
దూత ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగ చైతన్య నోటి వెంట సమంత పేరు రావడం విశేషం. సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తన ఫేవరేట్ అని నాగ చైతన్య అన్నారు. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్ పాయ్ మరో ప్రధాన పాత్ర చేశాడు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా సమంత నటించడం విశేషం.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదల అనంతరం నాగ చైతన్య-సమంత విడిపోయారు. వారి మధ్య విభేదాలకు ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కూడా కారణమంటూ కొన్ని ఊహాగానాలు వినిపించాయి. నాగ చైతన్య ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తనకు ఇష్టం అని చెప్పడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. అలాగే విడాకుల అనంతరం నాగ చైతన్య సమంత పేరు ప్రస్తావించింది లేదు. సమంత పరోక్షంగా, ప్రత్యక్షంగా పలుమార్లు నాగ చైతన్య మీద తన అసహనం బయటపెట్టింది.
నాగ చైతన్య ఈ విధంగా స్పందించలేదు. ఇక దూత కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నాగ చైతన్యకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. థాంక్యూ, కస్టడీ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నారు. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా తెరకెక్కిస్తున్నారు.