https://oktelugu.com/

Samantha: రెండవ పెళ్లి పై సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు..ఆ యంగ్ హీరోతో రిలేషన్ లో ఉన్నట్టేనా?

యాంకర్ ముందుగా ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ 'మీరు జీవితాంతం ఇలాగే సింగిల్ గా మిగిలిపోతారా?' అని అడగగా, దానికి సమంత 'నో' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ 'మీరే త్వరలో చూస్తారు కదా' అని బదులిచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 02:47 PM IST

    Samantha(5)

    Follow us on

    Samantha: మయోసిటిస్ వ్యాధికి చికిత్స చేయించుకున్న తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఏడాది నుండి సినిమా షూటింగ్స్ కి దూరం ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమంత, ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటుంది. రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ 7వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత, పలు ఇంటర్వూస్ ఇవ్వగా అవి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి సంబంధించిన విశేషాలను పంచుకుంది. అదే విధంగా యాంకర్ ఆమెని వ్యక్తిగతంగా పలు ప్రశ్నలు వేయగా, ఎలాంటి దాపరికం లేకుండా సమాదానాలు చెప్పింది సమంత.

    యాంకర్ ముందుగా ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు జీవితాంతం ఇలాగే సింగిల్ గా మిగిలిపోతారా?’ అని అడగగా, దానికి సమంత ‘నో’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘మీరే త్వరలో చూస్తారు కదా’ అని బదులిచ్చింది. అంటే సమంత నిజంగానే రిలేషన్ లో ఉందా?, ఉంటే ఎవరు?, ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్లేనా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే సమంత బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్లిన తర్వాత ఒక యంగ్ హీరోతో కొంతకాలం నుండి క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత ముంబై కి వెళ్ళినప్పుడల్లా ఆ యంగ్ హీరో ఇంట్లోనే ఉంటుందట. వీళ్లిద్దరు కలిసి అనేక ప్రైవేట్ పార్టీస్ కి ఇటీవల కాలం లో వెళ్లిన సందర్భాలు ఉన్నాయట. ఇంతకు ఎవరు ఆ యంగ్ హీరో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

    ఇదంతా పక్కన పెడితే సమంత ‘పుష్ప 2 : రూల్’ లో శ్రీలీల తో కలిసి ఐటెం సాంగ్ లో డ్యాన్స్ వేస్తుంది అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ వినిపించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో యాంకర్ సమంతని ప్రశ్న అడుగుతూ ‘మీరు పుష్ప చిత్రంలో చేసిన ఐటెం సాంగ్ దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. మళ్ళీ అలాంటి ఐటెం సాంగ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అది నిజమేనా?’ అని అడగగా, దానికి సమంత సమాధానం చెప్తూ ‘అవన్నీ ఫేక్ వార్తలు. ఇక మీదట నేను ఎలాంటి ఐటెం సాంగ్స్ లో కనిపించబోవడం లేదు’ అని చెప్పుకొచ్చింది. దీంతో గత కొద్దిరోజులుగా పుష్ప 2 లో సమంత ఐటెం సాంగ్ లో కనిపించనుంది అని వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇక ‘సిటాడెల్’ విషయానికి వస్తే హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి ఇది రీమేక్. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రని, ఇక్కడ సమంత చేసింది. స్పై యాక్షన్ మూవీ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో సమంత చేసిన పోరాట సన్నివేశాలను చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సమంత తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ చేసిన రాజ్ & డీకే ఈ సిరీస్ కి కూడా దర్శకత్వం వహించారు.