Samantha: సమంత, నాగ చైతన్య తమ విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇస్తూ ‘భార్యభర్తలుగా విడిపోయినా, స్నేహితులుగా కలిసే ఉంటాం’ అని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పడేసి ఎవరికీ వారు బిజీ అయిపోయారు. ముఖ్యంగా చైతు ‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మరో పక్క ఈ విడాకుల అంశం నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే, సమంత తాజాగా పోస్ట్ చేసిన ఒక మెసేజ్ ఆమె ప్రస్తుత మానసిక పరిస్థితి ఎలా ఉందో చెబుతుంది.

ఇంతకీ సమంత ఏమి పోస్ట్ చేసింది అంటే.. ‘నేను ఈ ప్రపంచాన్ని మార్చాలనుకునే ముందే.. మొదట నన్ను నేను మార్చుకోవాలి. నా బెడ్ రూమ్ ను నేను రెడీ చేసుకోవాలి. నా ఇంటిని నేను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మధ్యాహ్నం వరకూ నిద్రపోకుండా ఉండాలి. ఇక, ముఖ్యంగా పగటి కలలు కనడం మానేయాలి. అన్నిటి కంటే ముందు చేయాల్సిన పనుల పైనే దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయాలి’ అంటూ సమంత తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
తన పై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ తన వ్యక్తిగత జీవితం పై రకరకాల కామెంట్స్ చేస్తోన్న ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే.. ముందు తను మళ్ళీ మామూలు మనిషి అయి.. తన పని తాను చేసుకుంటూ ముందుకు పోవాలని సమంత అర్ధం వచ్చేలా మెసేజ్ చేసింది. మొత్తానికి సమంత ప్రస్తుతం చాలా బాధలో ఉన్నట్టు అర్ధం అవుతుంది.
అయితే, చైతుతో విడిపోతున్నాం అని ముందే తెలుసు కాబట్టి.. ఆ విషయంలో సమంత పెద్దగా బాధ పడటం లేదట. కానీ.. తను తీవ్రమైన బాధలో ఉన్న సమయంలో తన పై కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్స్ చేయడం తనను ఇంకా ఎక్కువ బాధ పెట్టిందట. ఏది ఏమైనా దశబ్దకాలం పాటు ఘాడంగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పడం అంటే.. తట్టుకోలేని బాధే.
ఇక నాగచైతన్య-సమంత అధికారికంగా విడాకుల గురించి ప్రకటించిన తర్వాత అక్కినేని అభిమానులతో పాటు సమంత అభిమానులు కూడా చాలా బాధ పడ్డారు. ముఖ్యంగా సమంత కుటుంబ సభ్యులు బాగా విచారం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.