RGV Konda movie: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా, ఏ సినిమా చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. కాంట్రవర్సీ దర్శకుడిగా ముద్ర పడినా తన పద్దతిను మాత్రం ఆర్జీవీ మార్చట్లేదు. వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘కొండా’. ఈ సినిమా ఎవరి పై తీస్తున్నాడో తెలుసా ? తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండా దంపతుల నేపథ్యాన్ని బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ‘కొండా’ సినిమా పోస్టర్లు కూడా వదిలాడు.

కాగా 1980వ సంవత్సరం జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి ప్రేమ కథకు కాస్త మసాలా యాడ్ చేసి ఈ సినిమా చేస్తున్నాడు. ఇక కొండా మురళికి నక్సలైట్ ఆర్కే తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి కూడా సినిమాలో ప్రత్యేకమైన సీన్స్ ఉంటాయట. మెయిన్ గా సినిమా బ్యాక్ గ్రౌండ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఇక పోస్టర్ పై ‘గాంధీ లెక్క రెండో చెంప జూపెట్టా నేను.. చంపేస్తా.. అర్థం కాలే’ అంటూ సీరియస్ లుక్ ఇచ్చిన కొండా మురళిని చూపించాడు.
అలాగే మరో పోస్టర్ లో చేతిలో తుపాకీ, చుట్టూ నక్సల్స్, తలకు ఎర్ర తువాలుతో కొండాను చూపించారు. అదే విధంగా ఇంకొక పోస్టర్ లో చేతిలో టీకప్పు పట్టుకుని సీరియస్ లుక్ ఇస్తోన్న కొండా మురళిని చూపించాడు. మొత్తానికి వర్మ పోస్టర్లలోనే సినిమా ఎలా ఉండబోతుందో పర్ఫెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. కొండా మురళి క్యారెక్టర్ ను సినిమాలో చాలా సీరియస్ గా చూపిస్తున్నారు.
బయట కూడా కొండా మురళి నిజంగానే అంత సీరియస్ గా ఉంటారా ? అయితే, మరో పక్క కొండా దంపతులు కావాలనే ఆర్జీవీకి డబ్బులు ఇచ్చి ఈ సినిమా చేయించుకుంటున్నారని.. కేవలం తెలంగాణలో తమ ఉనికిని చాటుకోవడానికి కొండా ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా ప్రయోగాన్ని చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, వారానికి ఒక సినిమా పోస్టర్ వదిలే ఆర్జీవీ.. కొండా సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కించి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాలా ?
అన్నట్టు ఈ కొండా సినిమా షూటింగ్ పూర్తిగా వరంగల్ పరిసర ప్రాంతాల్లోని జరగనుంది. ఇప్పటికే కొండా చిత్ర నిర్మాణం కోసం రామ్ గోపాల్ వర్మ అన్ని రకాలుగా సన్నాహాలు చేశాడట. మొత్తానికి చేతికి డబ్బులు అందినట్లు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ఆర్జీవీ ఈ సినిమా పై పడ్డాడు.