Samantha emotional comments: 15 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో సమంత(Samantha Ruth Prabhu) ఎలాంటి వైవిద్యభరితమైన క్యారెక్టర్స్ చేసిందో మనమంతా చూశాము. ఎంత అందంగా ఉంటుందో, అంతే అందం గా నటిస్తుంది కూడా. కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సైతం చేసి విజయాలను అందుకుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత విలన్ క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్స్ భయపడుతుంటారు. కానీ సమంత ధైర్యం గా విలన్ క్యారెక్టర్స్ కూడా చేసి సక్సెస్ అయ్యింది. అయితే నాగ చైతన్య తో విడాకులు తర్వాత మానసికంగా, శారీరకంగా సమంత చాలా ఒత్తిడికి గురైంది. మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకడం వల్ల చాలా కాలం వరకు ఆమె మంచానికే పరిమితమైంది. అయితే ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చిన సమంత సినిమాల ఎంపిక విషయం లో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
రీసెంట్ గానే ఆమె ‘గ్రాజియా ఇండియా’ అనే పాపులర్ మ్యాగజైన్ కి ఫోటో షూట్ ఇచ్చింది. అనంతరం ఆ మ్యాగజైన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడిన కొన్ని మాటలు సంచలనం గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘ఎన్ని సినిమాలు చేసాము అనేది ముఖ్యం కాదు, ఎలాంటి గుర్తించుకోదగ్గ అద్భుతమైన పాత్రలు చేశాము అనేదే ముఖ్యం. గతం తో పోలిస్తే ఇప్పుడు నాలో చాలా పరివర్తన వచ్చింది. గొప్ప పనులు చేయడానికి నా మనసు ప్రేరేపిస్తుంది. నాకున్న సమయం లో అత్యధిక శాతం సినిమాలకు, ఫిట్నెస్ కోసమే కేటాయిస్తున్నాను. ఎన్నో మంచి సినిమాలు, వెబ్ సిరీస్ లలో భాగం అయ్యాను. అవన్నీ డబ్బు కోసం చేసినవి కావు, నా మనసుకి దగ్గరైన కథలు మాత్రమే చేసాను. ఇక నుండి నేను తక్కువ సినిమాలను చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. నా శారీరక, మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధ్యానత ఇవ్వాలని అనుకుంటున్నాను’.
Also Read: చాలా కాలం తర్వాత ఒకే వేదికపై రానున్న ప్రభాస్,అనుష్క.. విషయం ఏమిటంటే!
‘ఒకప్పటి లాగా ఒకేసారి 5 సినిమాలు చేయడం వంటివి ఇక నుండి జరగదు. నా శరీరం చెప్పేది వినాలని కొన్ని అనుభవాల తర్వాత తెలుసుకున్నాను. కానీ తక్కువ సినిమాలు చేసినప్పటికీ కూడా ప్రేక్షకులు నన్ను మెచ్చుకునే పాత్రల్లోనే చేస్తాను. భవిష్యత్తులో నేను చేయబోయే సినిమాల సంఖ్య తగ్గినా, నాణ్యత విషయం లో మాత్రం ఎక్కడా తగ్గదు’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇకపై సమంత ని ఏడాదికి ఒక్క సినిమాలో మాత్రమే చూడగలం అన్నమాట. ఆమెని చివరిసారి వెండితెర పై చూసిన చిత్రం ‘ఖుషి’. ఆ తర్వాత డాక్టర్ల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న సమంత, మళ్ళీ శుభమ్ చిత్రం తో నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ని అందుకుంది. ఈ చిత్రం లో ఆమె ఒక చిన్న క్యారక్టర్ కూడా చేసింది. ప్రస్తుతం ఆమె తన సొంత నిర్మాణ సంస్థ లో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.