Comedian Ramachandra: మన చిన్నతనం లో చూసిన కొన్ని ఎవర్గ్రీన్ చిత్రాలను ఎప్పటికీ మరచిపోలేము. ఇప్పటికీ మనకు తీరిక దొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటాము. అలాంటి ఎవర్గ్రీన్ చిత్రాల్లో ఒకటి ‘వెంకీ'(Venky Movie). మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja), శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం లోని కామెడీ ఆరోజుల్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్ని తరాలు మారినా ఈ కామెడీ అవుట్ డేటెడ్ అనిపించదు, సోషల్ మీడియా లో మీమ్స్ రూపం లో ఈ చిత్రం లోని సన్నివేశాలు ఇప్పటికీ తిరుగుతూనే ఉంటాయి. ట్రైన్ ఎపిసోడ్, బ్రహ్మానందం కామెడీ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు. అయితే ఇందులో రవితేజ గ్యాంగ్ ఉండే నటీనటులు కూడా బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ తో పాటు సినిమా మొత్తం ఈ గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ లో బుజ్జి అని బొద్దుగా కనిపించే ఒక కమెడియన్ ఉంటాడు గుర్తుందా?.
ఆ క్యారక్టర్ చేసిన కమెడియన్ పేరు రామ చంద్ర(Ramachandra). ఈయన ఈ చిత్రం తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అంతే కాకుండా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘దుబాయి శ్రీను’ లో కూడా రవితేజ స్నేహితుల గ్యాంగ్ లో ఒకడిగా నటిస్తాడు. ఈ క్యారెక్టర్ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో వరుసగా సినిమా ఆఫర్స్ బాగానే వచ్చేవి కానీ, ఈమధ్య కాలం లో ఈయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే రీసెంట్ గా ఇతని దీనమైన పరిస్థితి ని చూసి అయ్యో పాపం అనిపించింది. నెల రోజుల క్రితం వరకు కూడా ఎంతో చలాకీగా తిరుగుతూ కనిపించిన ఈయన అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి, కాళ్ళు చేతులు పడిపోయి మంచానికి పరిమితం అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
నెల క్రితం వరకు కూడా బాగానే ఉండేవారు, అకస్మాత్తుగా ఏమైంది అని రామచంద్ర ని యాంకర్ అడగ్గా ‘అప్పుడు బాగానే ఉన్నాను కానీ, 15 రోజుల క్రితం మా స్నేహితుడికి సంబంధించిన డెమో షూట్ కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక లంచ్ బ్రేక్ తర్వాత అకస్మాత్తుగా కాళ్ళు చేతులు లాగేయడం జరిగింది. ఇక నా వల్ల కావడం లేదని నా స్నేహితుడికి చెప్పేసి ఇంటికి వచ్చేసాను. రాత్రి చెకప్ చేసుకుంటే బీపీ చాలా హై లో ఉన్నింది, రెండు రోజుల తర్వాత మా డాక్టర్ దగ్గరకి వెళ్తే CT స్కాన్ తీశాడు. స్కాన్ రిపోర్ట్ లో నాకు బ్రెయిన్ లో రెండు క్లాట్స్ ఉన్నాయని తెలిసింది. ఆ కారణం చేత ఎడమ చెయ్యి, ఎడమ కాళ్ళు మొత్తం పనిచేయకుండా పోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన వీడియో ని మీరు క్రింద చూడవచ్చు.
View this post on Instagram