Prabhas- Anushka Latest News: ప్రభాస్(Rebel Star Prabhas),అనుష్క(Anushka Shetty) జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మిర్చి సినిమా తో మొదలైన వీళ్లిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాహుబలి సిరీస్ వరకు కొనసాగింది. ఈడు జోడు చూసేందుకు చాలా ముచ్చటగా ఉంది, వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండును అంటూ అభిమానులు బాగా కోరుకున్నారు. కొంతకాలం వరకు వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే అని తెలిసింది. అయితే అభిమానులు మాత్రం ప్రభాస్, అనుష్క మళ్ళీ జంటగా నటిస్తే చూడాలని ఆశతో ఉన్నారు. ఆ ఆశ నెరవేరుతుందో లేదో తెలియదు కానీ, త్వరలోనే వీళ్లిద్దరు ఒకే వేదిక ని పంచుకోబోతున్నారు అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే వీళ్లిద్దరి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘బాహుబలి’ సిరీస్ విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా అక్టోబర్ 31 న ఈ రెండు చిత్రాలను క్లబ్ చేసి 5 గంటల సినిమాగా ‘బాహుబలి : ది ఎపిక్'(Baahubali : The Epic) అనే పేరుతో రీ రిలీజ్ కాబోతుంది.
ఇది సాధారణ రీ రిలీజ్ అయితే కాదు, చాలా గ్రాండ్ గా ఒక కొత్త సినిమా విడుదల అయ్యేటప్పుడు ఎలాంటి హంగామా చేస్తారో, అలాంటి హంగామా ని ఈ చిత్రం కోసం కూడా చేయబోతున్నారు. ఇప్పటికే రానా(Rana Daggubati), ప్రభాస్ ఇంటర్వ్యూ రామానాయుడు స్టూడియోస్ లో షూట్ చేశారట. త్వరలోనే ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ఘాటీ’ అనే చిత్రం వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఆమె హైదరాబాద్ లోనే ఉంది. పనిలో పనిగా ఆమె బాహుబలి రీ రిలీజ్ ప్రొమోషన్స్ కి కూడా డేట్స్ ని కేటాయించిందట.
Also Read: ‘సలార్’ ని దాటేసిన ‘మహావతార్ నరసింహా’..తదుపరి టార్గెట్ ‘కల్కి’?
అంతే కాదు, విడుదలకు ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ సిరీస్ లో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు కూడా హాజరు కాబోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్, అనుష్క ని ఒక జంటగా చూడాలని ఆశపడుతున్న అభిమానులకు కనుల పండుగే అని చెప్పొచ్చు. త్వరలోనే వీటికి సంబందించిన పూర్తి వివరాలను అధికారికంగా తెలియచేయనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి రీ రిలీజ్ ని మాత్రం ఎప్పుడు చూడలేదు. రెండు గంటల సినిమా అంటే పర్లేదు కానీ, ఏకంగా 5 గంటల సినిమా ని చూసేందుకు జనాలు ఎగబడుతారో లేదో చూడాలి.