https://oktelugu.com/

Niharika: భర్తతో స్పెయిన్​లో ఎంజాయ్​ చేస్తున్న నిహారిక

Niharika: మెగా కుటుంబం గారాల పట్టి నిహారిక కొణిదెలకు గతేడాది డిసెంబరు9న చైతన్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబం, ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం వైభంగా జరిగింది. కాగా, ఆ తర్వాత భర్తతో కలిసి నిహారిక మాల్డీవులకు హనీమూన్ వెళ్లింది. ఇప్పుడు వన్​ ఇయర్ యానవర్సరీ కానున్న సందర్భంగా మరో సారి హనీమూన్​ వెళ్లింది ఈ జంట. అయితే, ఈ సారి స్పెయిన్​లో విహరిస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 02:01 PM IST
    Follow us on

    Niharika: మెగా కుటుంబం గారాల పట్టి నిహారిక కొణిదెలకు గతేడాది డిసెంబరు9న చైతన్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబం, ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం వైభంగా జరిగింది. కాగా, ఆ తర్వాత భర్తతో కలిసి నిహారిక మాల్డీవులకు హనీమూన్ వెళ్లింది. ఇప్పుడు వన్​ ఇయర్ యానవర్సరీ కానున్న సందర్భంగా మరో సారి హనీమూన్​ వెళ్లింది ఈ జంట. అయితే, ఈ సారి స్పెయిన్​లో విహరిస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని నిహారిక.. తాజాగా ఓటీటీ వేదికగా మూడు ప్రాజెక్టుల్లో నటించేందుకు సిద్ధమైంది.

    Niharika

    Also Read: మా ఆయనకు అది ఇష్టం లేదు… కోరిక చంపుకోలేక!

    అందులో ఒకటైన ఒక చిన్నఫ్యామిలీ స్టోరీ ఇటీవలే స్ట్రీమింగ్​ అయ్యింది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు వచ్చిన ఈ వెబ్​సిరీస్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మిగిలిన రెండు ప్రాజెక్టులకు గ్యాప్​ దొరకడంతో.. భర్తతో కలిసి స్పెయిన్​లో ఎంజాయ్​ చేస్తోంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ఫొటోషూట్ చేయించుకుంది నిహారిక. వాటిని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

    గతంలో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్​గా నటించిన నిహారిక.. తెలుగు ప్రేక్షకులకు ఢీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినప్పటికీ.. వివాహం తర్వాత చాలా గ్యాప్​ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్​కు చిరు విజ్ఞప్తి