Nagarjuna: నాగ చైతన్య తో సమంత విడిపోయినప్పటి నుండి వాళ్ళిద్దరి గురించి సోషల్ మీడియా లో ఎన్ని కథనాలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో వివాహం చేసుకోబోతున్నాడు. రీసెంట్ గానే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది, అయినప్పటికీ కూడా సమంత – నాగ చైతన్య గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ జంటకి ఉన్న క్రేజ్ అలాంటిది. సమంత అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ లో నాగార్జున, నాగ చైతన్య కి వరుసగా సూపర్ హిట్స్ పడ్డాయి. వ్యాపార పరంగా కూడా సమంత ఉన్నప్పుడే బాగుండేది, కానీ ఇప్పుడు నాగార్జున ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదురుకుంటున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ప్రతీ రోజు మనం నాగార్జున N కనెవెన్షన్ హాల్ పై సోషల్ మీడియా లో, టీవీ న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. శోభిత అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టగానే ఇలాంటి పరిస్థితులు నాగార్జున కి ఎదురు అయ్యాయి అని చెప్పలేము కానీ, సమంత ఉన్నన్ని రోజులు ఇలాంటి సంఘటనలు జరగలేదు అని మాత్రం చెప్పొచ్చు. అంతే కాదు, నాగార్జున అంటే సమంత ఎంతో గౌరవం. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా నాగార్జున పుట్టినరోజు సమయంలో ఎన్నోసార్లు శుభాకాంక్షలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కోడలిగా ఉన్నన్ని రోజులు సమంత కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చేది. అందుకు ఒక ఉదాహరణ మీ ముందు ఉంచబోతున్నాము. బిగ్ బాస్ సీజన్ 3 నుండి ప్రస్తుత సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4 కి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో సినిమా షూటింగ్స్ కారణంగా రెండు వారాలు షో కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో బిగ్ బాస్ టీం అనేకమంది సెలెబ్రిటీలను కలిసి తాత్కాలికంగా హోస్టింగ్ వ్యవహరించామని రిక్వెస్ట్ చేసింది.
కానీ ఒక్కరు కూడా సాహసం చేసి హోస్టింగ్ చేసేందుకు ముందుకు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని కూడా అడిగారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని అధిగమించడానికి బిగ్ బాస్ టీం నాగార్జున ని సలహా అడగగా, ఆయన ఒక వారం రమ్యకృష్ణ ని హోస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండవ వారం ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో తన కోడలు సమంత ని నాగార్జున రిక్వెస్ట్ చేయగా, ఆమె ఆరోజు తనకి ఉన్న షూటింగ్స్ ని కూడా వాయిదా వేసి బిగ్ బాస్ కోసం డేట్స్ ని ఇచ్చిందట. ఆ ఎపిసోడ్ బంపర్ హిట్ అయ్యింది, ఏకంగా 12 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. అలా నాగార్జున కష్టసమయంలో సమంత చేయూత ని అందించింది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.