https://oktelugu.com/

Mokshagna: మోక్షజ్ఞ ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది…బాలయ్య కూడా అదే అనుకుంటున్నాడా..?

బాలయ్య నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ఎలాగైనా సరే మొదటి సినిమాతో తన టాలెంట్ మొత్తాన్ని చూపించుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 04:08 PM IST

    Mokshagna Teja

    Follow us on

    Mokshagna: సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. గత 50 సంవత్సరాల నుంచి ఈ పరంపర అనేది కొనసాగుతూ వస్తూనే ఉంది. మొదటి నందమూరి తారక రామారావు గారి కొడుకు అయిన బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక అతనికి ముందు హరికృష్ణ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయన హీరోగా నిలబడలేకపోయాడు. బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సినిమాలు చేస్తూ తన సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన తర్వాత నాగేశ్వరరావు కొడుకు అయిన నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను మోస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే వీళ్ళ తర్వాత కృష్ణ కొడుకు అయిన రమేష్ బాబు, మహేష్ బాబులు అలాగే చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ అలాగే నందమూరి మూడోవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు ఈ సినిమాతోనే మోక్షజ్ఞ కి భారీ క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

    గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ ఊరిస్తూ వస్తున్న బాలయ్య బాబు ఎట్టకేలకు 2025 వ సంవత్సరంలో మాత్రం మోక్షజ్ఞ సినిమాని రెడీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన కోసం పలు రకాల స్క్రిప్ట్ లను ఎంపిక చేసి పెట్టిన బాలయ్య బాబు తొందర్లోనే ఆ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి సినిమా విషయం పక్కన పెడితే రెండోవ సినిమా కోసం ‘భైరవ ద్వీపం’ సినిమాని రీమేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ కూడా రెండోవ సినిమాగా ‘మగధీర’ చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. అలాగే మోక్షజ్ఞ కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుందని బాలయ్య బాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి బాలయ్య అనుకున్నట్టుగానే మోక్షజ్ఞ కెరియర్ ని ప్లాన్ చేస్తారా? లేదంటే ఇంకేదైనా ప్లానింగ్ లో ఉన్నారా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి…