Deepthi Jeevanji : పారిస్ లో చారిత్రాత్మకంగా జరుగుతున్న పారాలింపిక్స్ భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు 16 మెడల్స్ సాధించారు. ఇంకా మరిన్ని మెడల్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల 400 మీటర్ల టి20 రేస్ లో స్ప్రింటర్ జ్యోతి జీవన్ జీ భారత్ కు కాంస్యం అందించింది. 21 సంవత్సరాల ఈమె 55.82 సెకండ్లలోనే తన పరుగును ముగించి సరికొత్త సంచలనం సృష్టించింది.. అయితే ఈ రేసులో ఉక్రెయిన్, టర్కీ అథ్లెట్లు సత్తా చాటారు. దీప్తిది తెలంగాణ రాష్ట్రం. ఈమె వరంగల్ జిల్లా కన్నడ గ్రామంలో జన్మించింది. దీప్తికి చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ పై విపరీతమైన ఇష్టం. అయితే ఆమె జన్మించినప్పటి నుంచి జ్ఞాపకశక్తి తక్కువగా ఉండేది. దీంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్లు, గ్రామస్తులు ఆమెను హేళన చేసి మాట్లాడేవారు. అన్ని కష్టాలను, నష్టాలను ఆమె భరించింది. కన్నీళ్లను దిగమింగుకుంది. తనకు ఇష్టమైన అథ్లెట్స్ లో సత్తా చాటింది. అందులో తనదైన ముద్రవేసింది. ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆమె ప్రయాణంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య భూమిక పోషించారు. ఆయన సలహా ఇవ్వడంతో దీప్తి జీవితమే మారిపోయింది.
మంగళవారం రాత్రి జరిగిన పారాలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీలలో జ్యోతి కాంస్యం దక్కించుకుంది. దీప్తి తండ్రి యాదగిరి ఒక ట్రక్ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. తన కూతురు కాంస్యం దక్కించుకోవడంతో ఇంటికి వచ్చి ఆ ఆనందాన్ని తన భార్య ధనలక్ష్మితో పంచుకున్నాడు. స్వీట్ బాక్స్ తీసుకొచ్చి.. చుట్టుపక్కల వాళ్లకు మిఠాయిలు ఇచ్చాడు. దీప్తి 2003 సెప్టెంబర్ 27న కల్లెడ గ్రామంలోని డిస్పెన్సరీ లో జన్మించింది. యాదగిరి – ధనలక్ష్మి దంపతులకు దీప్తి మొదటి సంతానం. దీప్తికి తల చిన్నగా ఉంటుంది. ముఖంలో అసాధారణ మార్పు కనిపిస్తుంది. ఆమెకు ముక్కు కూడా సరిగ్గా అభివృద్ధి చెందలేదు. పెదవులు పగిలిపోయి ఉంటాయి. మొదట్లో దీప్తి రూపంపై తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. బంధువులు కూడా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడేవారు.. అయినప్పటికీ తమ కూతురు ఇష్టాన్ని కాదనలేక.. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ తమకున్న అరికరం పొలంలో కొంత భాగాన్ని అమ్మారు. ఆమె క్రీడల కోసం ఖర్చు చేశారు. యాదగిరి 15 రోజులపాటు లారీ క్లీనర్ గా వెళ్తాడు. మిగతా పదిహేను రోజులు గ్రామంలోని వరి పొలాల్లో కూలిగా పని చేస్తాడు. యాదగిరి తండ్రి రామచంద్రయ్య మరణించినప్పుడు కొంతకాలం పాటు ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంది.. కూతురు కాంస్యం సాధించిన తర్వాత దీప్తి తల్లి ధనలక్ష్మి భావోద్వేగానికి గురైంది..” దీప్తి మాకు జన్మించినప్పుడు అందరూ హేళనగా మాట్లాడారు. కొందరైతే ఆమెను అనాధ ఆశ్రమానికి ఇవ్వాలని చెప్పారు. ఆమె పెరుగుతున్న కొద్దీ శారీరకంగా దృఢంగా మారింది. ఇతర పిల్లలు ఆమెను గేలి చేసినప్పుడు వెంటనే భావోద్వేగానికి గురవుతుంది.. దీప్తికి తన చెల్లెలు అమూల్యతో ఆడుకోవడం చాలా ఇష్టం. బెల్లంతో కలిపి చేసిన పాయసాన్ని ఇష్టంగా తింటుందని” ధనలక్ష్మి పేర్కొంది.
దీప్తి 2000 సంవత్సరంలో రూరల్ డెవలప్మెంట్ పాఠశాలలో చేరింది. ఆ స్కూల్ పిఈటి బియ్యాని వెంకటేశ్వర్లు దీప్తి ట్రాక్ పై పరిగెత్తడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆమెకు ఆర్థిక సాయం అందించాలని పాఠశాల యజమాని రామ్మోహన్రావును కోరాడు. దీంతో ఆయన తన వంతు సహాయం చేశాడు. ఇక దీప్తి సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్లీ డిజేబుల్ పర్సన్స్ లో పరీక్షించాలని గోపీచంద్ సలహా ఇచ్చాడు. ఆ పరీక్ష ఫలితాల తర్వాత పారా పోటీలలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం లభించింది. అలా పారా నేషనల్స్ పోటీలో ఆమె పాల్గొంది. ఆ తర్వాత మరొక లో జరిగిన వరల్డ్ ప్రిక్స్ పోటీలలో సత్తా చాటింది. ఆస్ట్రేలియాలో జరిగిన పారా ఓషియానియా పసిఫిక్ గేమ్స్ లో 400 మీటర్ల టైటిల్ పాదాక్రాంతం చేసుకుంది. దీప్తి ఒలింపిక్స్ లో కాంస్యం సాధించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.