Tata Sky Name change: భారత్ లో ప్రముఖ డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) కంపెనీ టాటా స్కై పేరు మారింది. టాటా స్కై పేరు ‘టాటా ప్లే’గా మారింది. అలాగే ప్రధాన సర్వీసుల్లోనూ భారీ మార్పులు వచ్చాయి. టాటా స్కై వినియోగిస్తున్న వారు కొత్త సర్వీసులకు మారనున్నారు.

మొత్తం టాటా స్కై విభాగంగా మార్పులు చోటుచేసుకుంది. నేటి నుంచి టాటా స్కై కొత్త పేరు కనిపించనుంది. టీవీ చానెళ్లతోపాటు ఓటీటీ సర్వీసులను కూడా టాటా ప్లే విస్తృతంగా అందించనుంది. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తోనూ టాటా సంస్థ చేతులు కలిపింది.
ఓటీటీ కాంబో ప్యాక్ లను తీసుకుంటే టాటా ప్లే కస్టమర్లు.. టీవీ చానెళ్లతోపాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
టాటా ప్లే బింగే మొత్తంగా 13 ప్రధాన ఓటీటీ యాప్స్ కు సపోర్టు చేస్తుంది. టాటా ప్లే జాబితాలో ‘నెట్ ఫ్లిక్స్ తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ +హాట్ స్టార్’తోపాటు మిగిలిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు ఉండనున్నాయి. కాగా ఓటీటీతో కలిపి వచ్చే చానెళ్ల ప్యాక్ లను అతి త్వరలో టాటా ప్లే ప్రకటించనుంది.
టాటా ప్లేతో నెట్ ఫ్లిక్స్ ఒప్పందంతో దీని కస్టమర్లు అందరూ ఉచితంగా ఈ సర్వీసులు చూడవచ్చు. డియాక్టివేట్ చేసుకున్న డీటీహెచ్ కస్టమర్లు రీచార్జ్ చేసుకొని మళ్లీ వీటన్నింటిని ఉచితంగా చూడవచ్చు. దీని కోసం ఎలాంటి రీ కనెక్షన్ చార్జెస్ ఉండవు. కొత్తగా తీసుకొచ్చిన సర్వీసులను, ప్రొడక్టులను సూచిస్తూ టాటా ప్లే పేరు తీసుకొచ్చారు. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేందుకు అత్యుత్తమైన సేవలు అందించడంలో కొత్త మార్పులను టాటా ప్లే ఈ విప్లవాత్మకంగా తీసుకొచ్చారు.
[…] Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇండియన్ క్రికెట్ జట్టు తొలిసారి వరల్డ్‌కప్ గెలిచిన నేపథ్యంతో తెరకెక్కిన మూవీ ‘83’. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్, ఆయన భార్యగా దీపిక పదుకొణె నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీ లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18 నుంచి నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొత్తం 5 భాషల్లో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ కాబోతుంది. […]