Kushi Musical Concert: సినిమా నటినటులు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఈవెంట్ లో ఉన్నప్పుడు కొంచెం అతి ఉత్సహం తగ్గించుకొని, పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి, కొంచెం తేడా కొట్టిన కానీ దారుణంగా ట్రోల్స్ కు గురికాక తప్పదు. తాజాగా సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైటెక్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ మధ్య కాలంలో చాలా గ్రాండ్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పాలి.
అయితే ఈ వేదిక మీద విజయ్ దేవరకొండ- సమంత చేసిన డాన్స్ లు విమర్శలకు దారితీశాయి. సాధారణంగా విజయ్ సినిమా ఫంక్షన్ అంటేనే కొంచెం క్రేజీగా కొంచెం అతిగా అనిపిస్తాయి. కాకపోతే ఈ మధ్య వరుస ప్లాప్స్ రావటంతో విజయ్ లో ఏమైనా మార్పులు వచ్చాయేమో అనుకున్నారు కానీ ఈ ఈవెంట్ లో ఆయన చేసిన హడావిడి చూస్తే ఏ మాత్రం మార్పు రాలేదని తెలుస్తుంది.
ఖుషి ఈవెంట్ లో హీరో హీరోయిన్స్ కలిసి డాన్స్ చేశారు. దాన్ని ఎవరు పెద్దగా తప్పు పట్టరు. గతంలో కూడా అనేక మంది ఇలా డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనం ముందే చెప్పుకున్నట్లు విజయ్ దేవరకొండ అంటేనే క్రేజ్ అనుకున్నాం కదా దానికి తగ్గట్లే చేస్తూ, ఒంటి మీద షర్ట్ తీసేసి డాన్స్ చేశారు విజయ్. నిజానికి అక్కడ అంత హడావిడి అవసరం లేదు. ఏదో చేయాలనీ ఇంకేదో చేశాడు మనోడు. ఒక స్థాయి హీరోయిన్ హీరో మాదిరి కాకుండా స్టేజి డాన్సర్స్ గా చేశారు.
దీంతో హీరో హీరోయిన్ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు ఇది ఖుషీ మ్యూజికల్ ఈవెంటా..? లేక ప్రీ వెడ్డింగ్ షూటా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఫ్యాషన్ కనిపించే విజయ్ మరియు సమంత కూడా ఈ ఈవెంట్ లో వాళ్ళు వేసుకున్న డ్రసులకు వాళ్ళు వేసిన డాన్స్ లకు అసలు సంబంధమే లేదు. నిజానికి ఖుషి సినిమా మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. ఈ ఈవెంట్ పుణ్యమా అని ట్రోల్స్ ద్వారా కూడా ఒక రకమైన పబ్లిసిటీ అయితే ఈ సినిమాకు వస్తుంది.