Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ సినిమా చేయబోతున్నాడా..?మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మమ్మూటీ ‘భీష్మ పర్వం’ అనే సినిమాని తెలుగులో చేయబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు ఫిలిం నగర్ లో..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసాడని..త్వరలోనే ఒక క్రేజీ డైరెక్టర్ తో మార్పులు చేర్పులు చేయించి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..ఇటీవలే మెగాస్టార్ హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కినప్పటికీ కూడా తెలుగు కి తగట్టుగా ఎన్నో మార్పులు చేర్పులు చేసి చాలా చక్కగా తెరకెక్కించాడు ఆ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా..సినిమాని చూస్తున్న ప్రేక్షకుడికి రీమేక్ చూస్తున్నాని అనే ఫీలింగ్ ఏ మాత్రం కలగకుండా చేసారు.

ఇప్పుడు అదే ఫార్ములా ని ‘భీష్మ పర్వం’ రీమేక్ కి కూడా ఉపయోగించబోతున్నారట..ఈ సినిమా మమ్మూటీ కెరీర్ లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది..OTT లో విడుదలైన తర్వాత తెలుగు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది..మెగాస్టార్ చిరంజీవి కి ఈ కథ సరిగ్గా సరిపోతుందనే చెప్పాలి..గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి ని చూస్తునంతసేపు ప్రతి అభిమానికి ‘ఈ చిరంజీవినే కదా మనం చిన్నప్పుడు చూసింది’ అని అనిపిస్తాది..భీష్మ పర్వం సినిమా కూడా చిరంజీవి కి అలాంటి సినిమానే అవుతుందని అంటున్నారు అభిమానులు..సరైన మార్పులతో చిరంజీవి కి తగ్గట్టుగా ఈ సినిమాని తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా చెప్పుకుంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా తో అభిమానులను ఉర్రూతలూ ఊగించిన మెగాస్టార్,ఈ రీమేక్ తో కూడా అదే రేంజ్ లో అలరిస్తాడో లేదో చూడాలి..ప్రస్తుతం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య మరియు భోళా శంకర్ వంటి సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాల తర్వాత ఆయన చెయ్యబొయ్యే చిత్రం ఇదేనని అంటున్నారు.