https://oktelugu.com/

Jr Ntr: ఎన్టీఆర్​-కొరటాల కాంబో సినిమాలో హీరోయిన్​గా సామ్​?

Jr Ntr: ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్​ఆర్​ఆర్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలవ్వడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇందులో కోమురం భీమ్​గా కనిపించనున్నారు తారక్​. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శవతో కలిసి సినిమా రూపొందించనున్నారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య సినిమా పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక.. వీరిద్దరి కాంబోలో సినిమా షూటింగ్​ కోసం సన్నాహాలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 27, 2021 / 12:52 PM IST
    Follow us on

    Jr Ntr: ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్​ఆర్​ఆర్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలవ్వడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇందులో కోమురం భీమ్​గా కనిపించనున్నారు తారక్​. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శవతో కలిసి సినిమా రూపొందించనున్నారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య సినిమా పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక.. వీరిద్దరి కాంబోలో సినిమా షూటింగ్​ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    ఈ క్రమంలోనే ఈ సనిమాలో హీరోయిన్​ ఎవరన్నదానిపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. గతంలో ఈ సినిమాలో కొరటాల బాలీవుడ్ హీరోయిన్​ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. కాగా, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్​ సమంత పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో సమంతకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇందులో సమంత మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్  పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

    ఈ సినిమాను సంక్రాంతి తర్వాత హైదరాబాద్​లో లాంఛనంగా పూజాకార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్​ సూపర్ హిట్​ అవ్వడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.