Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఎంతో మంది మదిని గెలుచుకుంది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. ఇదే సమయంలో వారి మధ్య స్నేహం కుదిరిందట. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం, విడిపోవడం వంటివి కూడా జరిగిపోయాయి.
ఇదెలా ఉంటే మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది ఈ బ్యూటీ. 2023లో రిలీజైన ఖుషి సినిమాలో చివరిగా కనిపించింది క్యూటీ సమంత. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించిన దాఖలాలు లేవు. ఇక గతేడాది వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించి అభిమానుల ముందుకు వచ్చింది. కానీ ఈ సిరీస్ ను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. గతంలో ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ లేవనే చెప్పాలి.
అమ్మడు సినిమాల్లో కనిపించకపోవడంతో అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూనే ఉంటుంది. అయితే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. అయితే సమంత రీసెంట్ పోస్ట్ వల్ల అభిమానులు గందరగోళంలో పడ్డారు.
ఈ ఇన్ స్టా స్టోరీలో ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న పిక్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్‌గా ఉంటుంది’ అంటూ రాసుకొచ్చింది సామ్. అంతేకాదు ఈ పోస్టుకు సాడ్ ఎమోజీ కూడా యాడ్ చేసింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. కేకే మీనన్, సికందర్ ఖేర్, సిమ్రాన్ బాగా, సకీమ్ సలీమ్, భువన్ అరోరా వంటి స్టార్లు కూడా ఇందులో భాగం అయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ అండ్ డీకే. ఇక వీరి దర్శకత్వంలోనే ఈ సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.