https://oktelugu.com/

Samantha : సమంత ఫోన్ వాల్ పేపర్ పై ఇప్పటికీ అతని ఫోటోనే ఉంటుందా..? బయటపడ్డ షాకింగ్ నిజం!

పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ఇండస్ట్రీ లోకి వచ్చిన పదేళ్ళకే ఈమె ఆ స్థాయికి చేరుకుంది.

Written By: , Updated On : February 13, 2025 / 02:09 PM IST
Samantha

Samantha

Follow us on

Samantha : పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ఇండస్ట్రీ లోకి వచ్చిన పదేళ్ళకే ఈమె ఆ స్థాయికి చేరుకుంది. సౌత్ లో కేవలం ప్రభాస్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా, మీడియం రేంజ్ హీరోలతో కూడా ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. మధ్యలో లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తో పాటుగా నెగటివ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం మయోసిటిస్ వ్యాధికి గురై సినిమాలకు దూరమైంది. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది సమంత. అయితే సమంత కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.

నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సమంత తన క్రిస్టియానిటీతో పాటు హిందూ మతాన్ని కూడా అనుసరించడం మొదలు పెట్టింది. అప్పటి నుండి దేవుళ్లను విపరీతంగా నమ్మడం మొదలు పెట్టింది. తిరుమలకు కాలినడకన వెళ్లడం, కొన్ని దేవాలయాల్లో దీపాలు స్వయంగా తన చేతుల మీదుగా వెలిగించడం, ఇలా ఒక్కటా రెండా ఎన్నో దైవ కార్యక్రమాలు చేసింది. నాగ చైతన్య తో విడాకులు తర్వాత కూడా ఆమె తాను నమ్మిన దైవాన్ని మర్చిపోలేదు. ఇప్పటికీ హిందూ మతానికి సంబంధించిన దేవుళ్లను ఎంతో ఆరాధిస్తుంది. రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వచ్చిన సమంతని మీడియా రిపోర్టర్స్ ఫోటోషూట్ కోసం రిక్వెస్ట్ చేయగా, ఆ కాసేపు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న ఫోన్ వాల్ పేపర్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ ఫోన్ వాల్ పేపర్ పై లింగభద్రాదేవి ఫోటో ఉంది. ఆమె కష్టకాలం లో ఆ దేవుడిని నమ్ముకొని అడుగులు ముందుకు వేసిందట. ఫలితాలు కూడా ఆమెకు అనుకూలంగా వచ్చాయి. అందుకే గత ఆరేళ్ళ నుండి ఆమె తన ఫోన్ వాల్ పేపర్ పై లింగభద్రాదేవి ఫోటోనే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే రీసెంట్ గా ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్'(Citadel) వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో విడుదలై యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న తెలిసిందే. వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ లో సమంత చేసిన ఘాటు రొమాన్స్ పెద్ద చర్చలకు దారి తీసింది. ఇంతకు ముందెప్పుడూ కూడా సమంత ఈ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాలు చేయలేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ వైపే ఉంది. తెలుగు లో పలు సినిమాలకు ఓకే చెప్తున్నా, అవి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు అవ్వడం గమనార్హం.