Actress Samantha: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కెరీర్‌లో దూకుడు పెంచింది. వరుస సినిమాలకు ఓకే చెప్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విభిన్న కథాంశాలున్న చిత్రాలతో పాటు, విభిన్న పాత్రలున్న సినిమాలకు ఓకె చెప్తోంది సామ్. కాగా, చైతూతో విడాకుల ప్రకటన తర్వాత సమంత సినిమాల వేగాన్ని ఓ రేంజ్‌లో పెంచేసింది. అంతకు ముందు ఆచితూచి సినిమాలు చేసిన సామ్, ఇప్పుడు వరుస సినిమాలను క్యూలో పెడుతోంది. ఇప్పటికే తెలుగుతో పాటు, హిందీలో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ చిన్నది.
తాజాగా మరో సినిమాను మొదలు పెట్టింది. శ్రీదేవీ మూవీస్ ప్రొడక్షన్స్‌లో సమంత ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణతో ‘ఆదిత్య 369’తో పాటు మరో మూడు సినిమాలు నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్, ప్రొడక్షన్ నంబర్ 14గా ‘యశోద’ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు చిత్రబృందం. ఇక సమంత కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా నిలవనుందని చెప్పాలి.
https://twitter.com/SrideviMovieOff/status/1467795282184130563?s=20
Also Read: NTR: ఎన్టీఆర్ తో పోటీపడి ఆస్తులను పోగొట్టుకున్న స్టార్ !
నిజానికి సమంత ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్-2తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించినప్పటికీ అది వెబ్ సిరీస్ అనే విషయం తెలిసిందే. దీంతో యశోదనే సమంత తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
Also Read: OTT Releases of the Week: ఈ వారం ‘ఓటీటీ’ రిలీజ్ ల పరిస్థితేంటి ?