https://oktelugu.com/

Mahesh Babu Trivikram: మహేష్ బాబు ఈ తప్పటడుగు వేస్తారా?

Mahesh Babu Trivikram: బాహుబలి దెబ్బకు ప్రభాస్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఊపులో ఎన్టీఆర్, రాంచరణ్ కూడా అదే బాటలో నడువనున్నారు. ఇక ‘పుష్ప’తో అల్లు అర్జున్ సైతం ‘తగ్గేదేలే’ అని సౌత్ ఇండియాలో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు కూడా అలాంటి అడుగులు వేయనున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా చిత్ర పరిశ్రమలో ఈ మేరకు ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2021 / 03:17 PM IST
    Follow us on

    Mahesh Babu Trivikram: బాహుబలి దెబ్బకు ప్రభాస్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఊపులో ఎన్టీఆర్, రాంచరణ్ కూడా అదే బాటలో నడువనున్నారు. ఇక ‘పుష్ప’తో అల్లు అర్జున్ సైతం ‘తగ్గేదేలే’ అని సౌత్ ఇండియాలో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబు కూడా అలాంటి అడుగులు వేయనున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా చిత్ర పరిశ్రమలో ఈ మేరకు ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.

    మహేష్ బాబు తన తదుపరి త్రివిక్రమ్ తో చేసే సినిమాతోనే పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ కంటే ముందే రాజమౌళి చిత్రం ద్వారా పాన్ ఇండియాకు పరిచయం కావాలని మహేష్ బాబు భావిస్తున్నాడు. రాజమౌళి వెంటనే సినిమా ప్రారంభిస్తే త్రివిక్రమ్ తో కాస్త గ్యాప్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అయితే త్రివిక్రమ్ విషయంలో మహేష్ అంత కఠినంగా వ్యవహరిస్తారా? లేదా అన్నది వేచిచూడాలి.

    మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందుతున్న చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డే ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ గా ఎంపికైంది. ప్రస్తుతం మహేష్ బాబు.. పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారివారి పాట’ ముగించిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నాడు.

    మే 2022 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో త్రివిక్రమ్ సినిమాను రాజమౌళి కోసం పక్కనపెడితే మహేష్ బాబు పెద్ద తప్పు చేసినవాడు అవుతాడు. ఇప్పటికే సుకుమార్ కు నో చెప్పాడు.. త్రివిక్రమ్ కు కూడా గతంలో నో చెప్పాడు. కానీ త్రివిక్రమ్ ను బలవంతంగా నమ్రత ఒప్పించి మహేష్ తో సంధి చేయించి ఇద్దరి సినిమాను పట్టాలెక్కించినట్టు సమాచారం. తనతో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సుముఖంగా లేకపోయినా దర్శకుడిని ఒప్పించాడట మహేష్ బాబు.

    ఇప్పుడు ఒకవేళ రాజమౌళితో మహేష్ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు అదే షూటింగ్ లో మహేష్ బాబు లాక్ కావాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ ఇంత కాలం పాటు మహేష్ కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ‘అలవైకుంఠపురంలో’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ఆగే పరిస్థితి లేదు. సో వీరిద్దరి స్నేహం మళ్లీ చెడుతుంది. ఇక మహేష్ వద్దకు సినిమా కోసం త్రివిక్రమ్ రాకపోవచ్చు.

    ఇక ‘సర్కారివారి పాట’ చుట్టూ కూడా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కొన్ని సన్నివేశాలను మళ్లీ రాయమని దర్శకుడు పరుశురాంను మహేష్ బాబు కోరినట్లు వార్తలు వచ్చాయి. 45 రోజులకు పైగా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటే త్రివిక్రమ్ సినిమాను మహేష్ బాబు వదలుకోవడం తెలివైన పని కాదు..

    ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం వెళితే.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ 2022లో, త్రివిక్రమ్ సినిమాను 2023లో విడుదల చేయవచ్చు. రాజమౌళి సినిమా 2024 నాటికి రెడీ అవుతుంది.కాబట్టి మహేష్ సినిమాల విడుదలల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండదు.

    త్రివిక్రమ్ సినిమాను మహేష్ బాబు క్యాన్సిల్ చేస్తే.. మళ్లీ దర్శకుడితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అల్లు అర్జున్ కు అది అడ్వాంటేజ్ అవుతుంది. అదే జరిగితే మహేష్ బాబు కు మరో దర్శకుడు దూరం అవుతాడు.