Samantha Latest Insta Post: నాగచైతన్య సమంత విడిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. సమంత ఏ పోస్ట్ పెట్టిన సరే ఇట్టే వైరల్ గా మారుతుంది. దీనికి ప్రధాన కారణం చైతన్య – సమంత విడాకులపై పెద్ద రచ్చ – చర్చ జరుగుతుండడమే ఇందుకు గల ప్రధాన కారణం.

సమంత-నాగచైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి తెరపడింది. గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాదంటూ అభిమానులు అనుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయడం సంచలనమైంది.
నాగచైతన్య సమంత(Samantha Latest Insta Post) విడిపోయిన తర్వాత అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలామంది సమంతదే తప్పంటూ విమర్శిస్తున్నారు. అంతే కాకుండా సమంత పై చాలా నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదంతా చూసి విసుగెత్తిన సామ్ పరోక్షంగా స్పందిస్తుంది. గత రెండు రోజులనుండి మళ్ళి తిరిగి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టడం మొదలు పెట్టింది. తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో … ‘మహిళలు ఏం చేసినా నైతికత గురించి ప్రశ్నిస్తారు. మగాళ్లు చేస్తే ఈ ప్రశ్న ఎప్పుడూ ఉండదు. అసలు ఓ సమాజం గా మనకే ఏ నైతికత లేదు’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
ఈ పోస్ట్ ద్వారా సమంత తన అభిమానులకి ఏం చెప్పాలని అనుకుంటుంది? సోషల్ మీడియా వేదికగా చైతన్య ని ఏకి పారేస్తుందా ..? సమంత కి ఇష్టం లేకుండానే నాగ చైతన్య కి విడాకులు ఇచ్చిందా.. అనే ఎన్నో రకాల ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానమిస్తుంది. మరి ఇంతకీ ఈ జంట మళ్ళి కలుస్తారో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.