https://oktelugu.com/

Samantha: నాగ చైతన్య కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తూ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన సమంత..!

నాగ చైతన్య మాత్రం ప్రేమకు విలువ ఇవ్వకుండా, తనతో వైవాహిక జీవితం గడుపుతున్న సమయంలోనే శోభిత తో రిలేషన్ పెట్టుకున్నాడు. అంటే అతనికి ప్రేమ విలువ తెలియదు, ప్రేమ ఎంత గొప్పది అని సమంత తన క్వాట్ ద్వారా పరోక్షంగా తెలిపింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి నుండి కోలుకున్న సమంత, డాక్టర్ల సలహా మేరకు కొన్ని రోజులు సినిమాలకు విశ్రాంతిని ఇచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 05:25 PM IST

    Samantha(3)

    Follow us on

    Samantha: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ ఉండే పేర్లు నాగ చైతన్య, సమంత. వీళ్లిద్దరికీ పెళ్లి జరగబోతుంది అన్నప్పటి నుండి వీళ్ళ డామినేషన్ సోషల్ మీడియా లో మొదలైంది. అప్పటి నుండి వీళ్లిద్దరు విడాకులు తీసుకొని ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయ్యేంత వరకు, వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో వచ్చిన కథనాల కౌంట్ వరల్డ్ రికార్డు కూడా కొట్టిందొచ్చు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి క్రేజీ కాంబినేషన్ ఇది. నాగ చైతన్య రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఏడాదిలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయినప్పటికీ కూడా సమంత, నాగ చైతన్య ని కలుపుతూ సోషల్ మీడియా లో కథనాలు వస్తూనే ఉన్నాయి.

    వీళ్లిద్దరు ఒకరినొకరు పూర్తిగా మర్చిపోయినా, జనాలు మర్చిపోవడం లేదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది ఇలా ఉండగా సమంత అప్పుడప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నాగ చైతన్య పై పరోక్షంగా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అలా రీసెంట్ గా కూడా ఆమె ఒక పరోక్ష కౌంటర్ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఆమె సెప్టెంబర్ 21 వ తారీఖున తన సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం లో పాల్గొన్నది. అమెరికా లో ఈ వివాహ మహోత్సవం క్రైస్తవ మతం పద్దతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ కుటుంబం తో కలిసి చాలా అద్భుతమైన క్షణాలు గడిపినందుకు ఆనందంగా ఉంది అంటూ అభిమానులకు చెప్పుకొచ్చింది. అలా డేవిడ్, నికోల్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ‘ఈ ప్రపంచం లో ఉన్న బంధాలన్నటికంటే ప్రేమ గొప్పది’ అంటూ చెప్పుకొచ్చింది. దీనిని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నాగ చైతన్య ని ఉద్దేశిస్తూ సమంత చేసిన కామెంట్స్ గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆమె ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది.

    కానీ నాగ చైతన్య మాత్రం ప్రేమకు విలువ ఇవ్వకుండా, తనతో వైవాహిక జీవితం గడుపుతున్న సమయంలోనే శోభిత తో రిలేషన్ పెట్టుకున్నాడు. అంటే అతనికి ప్రేమ విలువ తెలియదు, ప్రేమ ఎంత గొప్పది అని సమంత తన క్వాట్ ద్వారా పరోక్షంగా తెలిపింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి నుండి కోలుకున్న సమంత, డాక్టర్ల సలహా మేరకు కొన్ని రోజులు సినిమాలకు విశ్రాంతిని ఇచ్చింది. ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావేరేజి గా నిల్చింది. ఇప్పుడు అతి త్వరలోనే ఆమె అమెజాన్ ప్రైమ్ లో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు రాబోతుంది. వీటితో పాటు రీసెంట్ గానే తెలుగు లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంతకాలు చేసిందట, వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనుంది.