Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక విలువలు ఉన్న మనిషి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కొన్ని విషయాలపై ఆయన మాటల్లోని విలువలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన ఆలోచనలకూ తగ్గట్టుగా సినిమా నుండి రాజకీయాల వైపు అడుగులు పెట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూ, మరోపక్క రాజకీయాల్లో కొనసాగడం అంటే సాధారణమైన విషయం కాదు. ఈ రెండు రంగాలు కూడా మహాసముద్రలు వంటివి. మహామహులు సైతం సినిమాలు చేస్తున్నప్పుడు రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటూ సినిమాలను కొనసాగించడం వంటివి చేసేవారు కాదు. ఎందుకంటే రెండిటిని ఒకేసారి బ్యాలన్స్ చేయడం చాలా కష్టం. కానీ పవన్ కళ్యాణ్ చేసి చూపించి చరిత్ర తిరగరాశాడు. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతూనే, ఇప్పుడు సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్.
నేడు ఉదయం 7 గంటల సమయం నుండి 11 గంటల వరకు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం లో బిజీ అయ్యాడు. కేవలం చిన్న చిన్న పనులకే మనం ఎంతో ఒత్తిడికి గురి అవుతుంటాం, అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలను సమర్థవతంగా ఒకే సమయం లో ఎలా బ్యాలన్స్ చేస్తున్నాడు అనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. ఈ రెండిటిని బ్యాలన్స్ చేయాలంటే ఎంతో యోగా శక్తి ఉండాలి. పవన్ కళ్యాణ్ కి అది ఉంది కాబట్టే ఆయన ఈ రెండు రంగాలలో రాణిస్తున్నాడు. నేడు ఆయన యోగా గురించి ఇంస్టాగ్రామ్ లో వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘యోగా అనేది మన సనాతన ధర్మం లో ఒక భాగం..మన జీవితాన్ని సరైన సమతూల్యం తో బ్యాలన్స్ చేస్తూ మనలోని ఆధ్యాత్మిక విలువలను పెంచుతుంది’ అని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అప్లోడ్ చేసిన ఈ వీడియో లో ఆయన గతం లో చేసిన యోగాసనాలకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. అవి చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
రామ్ దేవ్ బాబా తరహాలో పవన్ కళ్యాణ్ యోగాసనాలు వేసాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ ఆసనాలు సంబంధించిన వీడియో ని మీరు కూడా చూసేయండి. కొమరం పులి సినిమాకి ముందు ఈ ఆసనాలు పవన్ కళ్యాణ్ వేసినట్టు ఆ లుక్ ని చూస్తే అర్థం అవుతుంది. అయితే గత దశాబ్దం లో పవన్ కళ్యాణ్ కి బ్యాక్ పెయిన్ వచ్చింది. అప్పటి నుండి ఆయన ఇలాంటి తీవ్రమైన వర్కౌట్స్ కానీ, యోగాసనాలు వేయడం కానీ ఆపేసాడు. అయితే పవన్ కళ్యాణ్ వేసిన ఈ ఆసనాలు సౌత్ ఇండియా లో ఏ హీరో కూడా వేయలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో సంవత్సరాల సాధన ఉంటే తప్ప ఇలాంటి ఆసనాలు వేయడం కష్టం. సినిమాల్లోకి రాకముందు నుండే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆసనాలు వేసేవాడని టాక్.