Samantha: సమంత… ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ … నిజంగానే అందర్నీ మాయే చేసింది అని చెప్పాలి. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సామ్… తనదైన నటనతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి. ఇటీవల నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది సమంత. ఆ ప్రకటనకు ముందు, ప్రకటన తర్వాత కూడా మీడియా లో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే ఈ మేరకు తనపై అనుచిత కధనాలు రాసిన మూడు యూట్యూబ్ ఛానల్ లపై కోర్టుకెక్కి… విజయం సాధించిన ఈ భామ. సోషల్ మీడియా లో మాత్రం తనడైన శైలిలో యాక్టివ్ గా ఉంటూనే ఉంటుంది. తాజాగా పెళ్లి పై ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది సమంత.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకుని నిలబడగలిగేలా ఆడపిల్లల్ని పెంచాలంటూ భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన పోస్ట్‌ని సామ్ షేర్ చేసింది. ఆ పోస్ట్ లో ‘‘మీ కుమార్తెను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చింతించకుండా… ఆమెను శక్తివంతంగా తీర్చిదిద్దండి. కుమార్తె పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టడానికి బదులు ఆమె చదువుపై ఖర్చుపెట్టండి. ముఖ్యంగా పెళ్లికి ఆమెను సన్నద్ధం చేయడానికి బదులు… తన కాళ్లపై తాను నిలబడగలిగేలా చేయండి. తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం నేర్పించండి’’ అనే ఓ సందేశాన్ని రాణీ రాంపాల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ నచ్చడంతో సమంత దాన్ని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే… ‘శాకుంతలం’, తమిళ్, తెలుగు లో రూపొందుతున్న ‘కాతువక్కుల రెందు కాదల్’ చిత్రాలతో పాటు తాజాగా ఆమె మరో రెండు కొత్త ప్రాజక్ట్స్‌ని సామ్ ఓకే చేసినట్లు తెలుస్తుంది.