https://oktelugu.com/

Samantha: నా టైం వచ్చింది.. ఇప్పుడు చూపిస్తా నా తఢాఖా.. సమంత సంచలన పోస్ట్ వైరల్!

ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య తో ప్రేమాయణం నడిపి అతన్ని పెళ్లి చేసుకున్న ఈమె, నాలుగేళ్లకే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఎంతటి మానసిక వేదనకు గురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 11, 2024 / 06:14 PM IST

    Samantha

    Follow us on

    Samantha: సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసి అతి తక్కువ సమయంలోనే ఆమె ఈ స్థాయికి చేరుకుంది. అంతే కాదు, ఈమె జీవితం లో ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదురుకుంది. ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య తో ప్రేమాయణం నడిపి అతన్ని పెళ్లి చేసుకున్న ఈమె, నాలుగేళ్లకే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఎంతటి మానసిక వేదనకు గురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒత్తిడి ని భరించలేక ‘మయోసిటిస్’ అనే వ్యాధిని కూడా శోకించుకుంది. ప్రాణాలతో చెలగాటం ఆడి, చివరికి ఆ వ్యాధి నుండి దిగ్విజయం గా కోలుకుంది. అయితే డాక్టర్లు కొంతకాలం విరామం తీసుకోమని సూచనలు ఇవ్వడం తో, గత కొంతకాలం గా ఆమె షూటింగ్స్ కి దూరంగా ఉంటుంది.

    ఇప్పుడిప్పుడే ఆమె మళ్ళీ సినిమా షూటింగ్స్ తో బిజీ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే ఆమె మాజీ భర్త నాగ చైతన్య ఇటీవలే ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అతి త్వరలోనే ఆమెను ఆయన పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అయితే నేడు సమంత పెట్టిన ఒక పోస్టు ని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ‘ఏ డే ఇన్ మై లైఫ్’ అంటూ కేపిటల్ లెటర్స్ తో పెద్దగా ఆమె క్యాప్షన్ పెట్టేలోపు ఏదైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో, నాగ చైతన్య కి కౌంటర్ ఇస్తుందేమో అని భావించి అభిమానులు ఆ వీడియో ని ఓపెన్ చేసి చూసారు. కానీ తీరా ఆ వీడియో చూస్తే ఆమె దినచర్య మొత్తం అందులో ఉంది. పొద్దునే లేచి బ్రష్ చేసుకోవడం, ఆ తర్వాత జిమ్ చేయడం, ఆ తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ చేయడం. కార్ లో కూర్చొని కళ్ళ రక్షణకు సంబంధించిన అద్దాలు పెట్టుకోవడం, ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లడం, మేకప్ చేసుకోవడం, తిరిగి ఇంటికి వచ్చి పడుకోవడం. కేవలం ఇవి మాత్రమే ఆ వీడియో లో ఉన్నాయి.

    దీనిని చూసి అభిమానులు, ఇందుకా ఇంత బిల్డప్ ఇచ్చావు, నువ్వు పెట్టిన క్యాప్షన్ చూసి నీకు ఇది జీవితం లో అతి ముఖ్యమైన రోజు అని అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా సమంత ఒక పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క ఇతర వ్యాపారాల్లో కూడా తలదూరుస్తుంది. రీసెంట్ గానే ఈమె వరల్డ్ పికెల్ బాల్ చెన్నై టీం ని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ఆమె మాజీ భర్త అక్కినేని నాగచైతన్య హైదరాబాద్ రేస్ కోర్స్ టీం ని కొనుగోలు చేయడం గమనార్హం. ఒకేసారి రేసింగ్ లో రెండు డిఫరెంట్ ప్రాంతాలకు చెందిన టీమ్స్ ని వీళ్లిద్దరు కొనడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.