https://oktelugu.com/

Share market : తక్కువ రేటు అని చూస్తే.. మొదటికే మోసం అవుతుంది.. షేర్స్ తో జాగ్రత్త..!

షేర్స్ లో పెట్టుబడులు పెట్టి తొందరగా ధనవంతులు అయినవారు చాలా మంది ఉన్నారు. అలాగే పూర్తిగా నష్టపోయిన వారు ఉన్నారు. ఇందులో రెండు రకాల మనుషులు ఉన్నారు కాబట్టి ఎవరి అంచనాలను చూజ్ చేసుకోవాలో బాగా ఆలోచించాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 11, 2024 / 06:07 PM IST

    Share market

    Follow us on

    Share market : షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ రోజులు కష్టపడి.. జీవితాంతం సమయం వృథా చేసుకోవడం నేటి కాలంలో ఎవరూ అనుకోవడం లేదు. ఆ ఆలోచన మంచిదే. కానీ చాలా తెలివిగల వారు మాత్రమే ఇలా తక్కువ సమయంలో ఎక్కవ డబ్బులు సంపాదిస్తారు. కొంత మంది వారిని చూసి తాము కూడా డబ్బు సంపాదించాలని చూస్తారు. కానీ అక్కడే బురదలో కాలు వేస్తారు. ఎందుకంటే ఒకరి ఆలోచనలను ఫాలో అవడం కాకుండా ఎవరికి వారు సొంతంగా ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యండా డబ్బు ఇన్వెస్ట్ మెంట్ చేసే విషయంలో ఈ సూత్రాన్ని బాగా పాటించాలి. నేటి కాలంలో స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టి సంపాదించాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.. అవేంటంటే?

    షేర్స్ లో పెట్టుబడులు పెట్టి తొందరగా ధనవంతులు అయినవారు చాలా మంది ఉన్నారు. అలాగే పూర్తిగా నష్టపోయిన వారు ఉన్నారు. ఇందులో రెండు రకాల మనుషులు ఉన్నారు కాబట్టి ఎవరి అంచనాలను చూజ్ చేసుకోవాలో బాగా ఆలోచించాలి. కొందరు స్టార్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు షేర్ రేటు ఉదాహరణకు రూ. 1000 ఉంటే దానిని కొనడానికి వెనుకడుగు వేస్తారు. అదే రూ. 2 ఉంటే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే రూ. 1000 తో ఒక షేర్ కొనే బదుతు రూ.2 తో ఎక్కువ షేర్లు కొనచ్చు కదా.. అని ఆలోచిస్తారు.

    కానీ ఇది చాల వరుకు పొరపాటు అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఒక కంపెనీ షేర్ తక్కువగా ఉందంటే ఆ షేర్ బాగా పడిపోయిందని అర్థం. అంతేకాకుండా ఆ షేర్ ఎంత కాలం ఆ స్థితిలో ఉందో తెలుసుకోవాలి. ఎక్కువ కాలం ఇదే స్టేజిలో ఉంటే మీరు పెట్టే పెట్టుబడులు తిరిగి రావని అర్థం. అందువల్ల తక్కువ రేటుతో ఉన్న షేర్ల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. అలాగే ఒక కంపెనీ షేర్ ధర ఎక్కువగా ఉందంటే అది ప్రాఫిట్ లో ఉందని తెలుసుకోవాలి. ఈ కంపెనీ షేర్ ధర ఎక్కువగా ఉందంటే కొన్ని సంవత్సరాలుగా ఇది హైక్ పొజిషన్లో ఉంటుందని గ్రహించాలి.

    ఈ విషయంలో అవగాహన లేకుండా అస్సలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావొచ్చు. అయితే దీని గురించి ఎలా తెలుసుకోవాలి? అని కొందరికి సందేహం ఉంటుంది. స్టాక్ మార్కెట్ గురించి వివరించే నిపుణులు ఆన్ లైన్ లో ఎంతో మంది ఉన్నారు. వారిని సంప్రదించాలి. అంతేకాకుండా ఎలాంటి సందేహం ఉన్నా వాటిని తీర్చడానికి కొందరు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కూడా సంప్రదించవచ్చు. అంతేకానీ పెట్టుబడుల విషయంలో ఈ పొరపాట్లు చేయకుండా ఉండాలి. ఇక షేర్లు కొనే ముందు నిపుణులను తప్పనిసరిగా కలుసుకోవాలి. వారి సూచనల మేరకు పెట్టుబడులుపెట్టడం మంచిది. అవగాహన వచ్చిన తరువాత సొంతంగా కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు.