Telugu actors : ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అంటూ సాగే పాట మనలో ఉత్తేజాన్ని కలిగిస్తోంది. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ మన తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పిన పదాలను ఎలా మర్చిపోగలం ? అయితే, కొందరు సినిమా వాళ్ళు మన జాతి నిండు గౌరవాన్ని, తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు ఉన్నారు.

మనకు తెలుసు. హాలీవుడ్ అంటే సినీ ప్రపంచానికి మకుటం లేని మహారాజు. పైగా ప్రపంచ సినిమాని శాసిస్తున్న సినీ పరిశ్రమ కూడా హాలీవుడే. మరి అలాంటి హాలీవుడ్ లో నటించి మెప్పించిన తెలుగు సినీ ప్రముఖులు కొందరు ఉన్నారనే సంగతే నేటి తరానికి పెద్దగా తెలియదు. ఇంతకీ ఆ సినీ ప్రముఖులు ఎవరెవరు అంటే.. పైడి జైరాజ్ : తెలంగాణ సిరిసిల్లా జిల్లాలో పుట్టి పెరిగారు. ఈయన హైదరాబాద్ నైజాం కాలేజీలో చదువుకున్నారు. అయితే, పైడి జైరాజ్ ‘నైన్ హవర్స్ టు రామా, మాయా’ లాంటి హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించారు.

రాజనాల : అలనాటి తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పదానికి పర్యాయపదం రాజనాల. ఎన్నో విభిన్న వేషాలలో నటించి ఆకట్టుకున్న రాజనాల… ‘ది మాగ్నిఫిషియెంట్ మాయా’ అనే హాలీవుడ్ సినిమాలో విలన్స్ లో ఒకరిగా నటించారు. సుమన్ : ఈ జనరేషన్ లో హాలీవుడ్ సినిమాలో నటించిన తెలుగు హీరోగా సుమన్ పేరే ముందు చెప్పుకోవాలి. కెవిన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘Death and Taxis’ అనే హాలీవుడ్ సినిమాలో సుమన్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించారు.

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు : సింగీతం గారు కూడా ‘Son of Aladdin, Little John’ అనే రెండు హాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. నటుడు శరత్ బాబు : చాలామందికి తెలియదు. శరత్ బాబు కూడా ‘Walking Dreams’ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించి మెప్పించారు. నటి లక్ష్మీ మంచు : మంచు లక్ష్మి ‘The Ode, Dead Air’ లాంటి రెండు ఆంగ్ల చిత్రాలలో చిన్న పాత్రలలో నటించారు.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ : ‘Quickgun Murugan’ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఇతర భాషలలోకి అనువాదమైంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లాంటి ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాకి ప్రొడక్షన్ కంపెనీగా వ్యవహరించడం విశేషం.