Samantha : సమంత(Samantha Ruth Prabhu) కి కెరీర్ ప్రారంభం నుండి ఇండస్ట్రీ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే కచ్చితంగా చిన్మయి పేరు వినిపిస్తుంది. అప్పట్లో ఈమె సమంత ప్రతీ సినిమాకు డబ్బింగ్ చెప్పేది. హస్కీ వాయిస్ తో చాలా క్యూట్ గా అనిపించేది ఆ గొంతు. అలా వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఒకే కుటుంబం లాగా కలిసిపోయే రేంజ్ స్నేహితులు అయ్యారు. చిన్మయి భర్త ప్రముఖ హీరో/ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అని విషయం మన అందరికీ తెలిసిందే. సమంత అతనితో కూడా ఒక తమిళ సినిమా చేసింది. అప్పటి నుండే అతనితో మంచి పరిచయం, ఇక చిన్మయి ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పరిచయం స్నేహంగా బలపడింది. రీసెంట్ గా సమంత కోలీవుడ్ లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొని గోల్డెన్ క్వీన్ అవార్డుని సొంతం చేసుకుంది.
Also Read : సమంత పెళ్ళికి లైన్ క్లియర్..కానీ చిన్న సమస్య ఒకటి ఉంది!
ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ గురించి, అదే విధంగా ఇండస్ట్రీ లో తనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నేను అనారోగ్యానికి గురై, నాకు ఈ జీవితం ముగిసిపోతుందేమో అని భయపడుతున్న రోజుల్లో, రాహుల్ రవీంద్రన్ నా పక్కనే ఉన్నాడు. హాస్పిటల్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు నా బాగోగులు చూసుకుంటూ, నన్ను డిప్రెషన్ లోకి పోనివ్వకుండా చూసుకునేవాడు. తన పనులన్నీ మానుకొని నా కోసమే అత్యధిక సమయం కేటాయించేవాడు. ఈ బంధానికి నేను ఎలాంటి పేరు పెట్టలేను. స్నేహితుడు , సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడు ఇలా ఏ పేరు తో కూడా పిలవలేను’ అని చెప్పుకొచ్చింది. వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ ఎమోషనల్ బాండింగ్ ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా నేను ఇంత మంది అభిమానులను సొంతం చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలిని. నా కష్టం తో పాటు, లక్ కూడా కలిసి రావడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇకపోతే ఆమె ఇన్ని రోజులు కేవలం హీరోయిన్ గా మాత్రమే మనల్ని అలరించింది. ఇప్పుడు ఆమె నిర్మాతగా సరికొత్త అవతారాన్ని ఎత్తింది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని స్థాపించి, కొత్తవాళ్లతో ‘శుభమ్’ అనే చిత్రాన్ని తీసింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా సరికొత్త గా ఉన్నట్టుగా ఉంది, కచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : డ్రామాలు ఆడొద్దు అంటూ సాయి పల్లవి కి నెటిజెన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!