Samantha : సోషల్ మీడియా లో సమంత(Samantha Ruth Prabhu), నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) గురించి ప్రతీ రోజు ఎదో ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారం అవుతూనే ఉంటుంది. మీడియా కి ఎలాంటి వార్త లేని సమయంలో సమంత, నాగ చైతన్య బంధం గురించి ఎదో ఒక గాసిప్ ని క్రియేట్ చేయడమో, లేకపోతే వాళ్లకు సంబంధించిన పాత జ్ఞానపకాలను నెమరువేసుకుంటూ ఉండడంతో చేస్తుంటారు. వీళ్లిద్దరికీ సంబంధించిన విషయాలంటే జనాలకు అంత ఆసక్తి ఉంటుంది మరీ. నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ సంబంధించిన కథనాలు రావడం చాలా అంటే చాలా తక్కువ. ఇప్పటికీ సమంత, నాగ చైతన్య ని కలుపుతూనే సోషల్ మీడియా లో స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా సమంత కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ లో నాగ చైతన్య మీద ప్రేమ చూపిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!
గతంలో ఆమె సాక్షి టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరోల లుక్స్ గురించి 10 కి ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పాలి అంటూ యాంకర్ సమంత ని అడుగుతుంది. ముందుగా హృతిక్ రోషన్(Hrithik Roshan) గురించి అడగ్గా, సమంత సమాధానం చెప్తూ ‘హృతిక్..నాకు తెలుసు ఈ సమాధానం చెప్పిన తర్వాత నీ ఫ్యాన్స్ నన్ను చంపేయొచ్చు..కానీ నన్ను క్షమించు నీ లుక్స్ నాకు అంతగా నచ్చవు. పదికి కేవలం నేను 7 మార్కులే ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా మహేష్ బాబు గురించి అడగగా పది కి పది మార్కులు, నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి పది కి పది మార్కులు ఇచ్చింది. అలా అప్పట్లో ఆమె తన భర్త పై విపరీతమైన ప్రేమని చూపిస్తూ ఇలా మార్కులు ఇచ్చింది.
అదే విధంగా బాలీవుడ్ లో అమ్మాయిలు అమితంగా ఇష్టపడే రణబీర్ కపూర్ కి 10 కి 8 మార్కులు ఇచ్చిన సమంత, షాహిద్ కపూర్ కి ‘కమీనే’ చిత్రానికి ముందు 10 కి మార్కులు, ‘కమీనే’ తర్వాత 10 కి 9 మార్కులు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. ఈ ఇంటర్వ్యూ సమయంలో సమంత, నాగచైతన్య లకు పెళ్లి కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్లిద్దరూ ఆ సమయంలో రిలేషన్ లో ఉన్నారు. అందుకే అప్పట్లో తన కాబోయే భర్తకు హృతిక్ రోషన్ కంటే ఎక్కువ మార్కులు ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ ఆమె దృష్టిలో అదే అభిప్రాయం ఉందా, లేకపోతే మారిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే సమంత, నాగ చైతన్య కెరీర్స్ పరంగా ఎవరి స్టైల్ లో వాళ్ళు దూసుకుపోతున్నారు. నాగచైతన్య రీసెంట్ గానే ‘తండేల్’ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.