Veera Dheera Sura 2 : రీసెంట్ గా విడుదలైన చిత్రాలలో క్రిటిక్స్ నుండి విపరీతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘వీర ధీర శూర'(Veera Dheera Sura 2). చియాన్ విక్రమ్(Chiyaan Vikram) హీరో గా నటించిన ఈ సినిమాకు పబ్లిక్ లో కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ విడుదలకు ముందు నుండి ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాకపోవడం వల్ల ఓపెనింగ్స్ అసలు రాలేదు. తమిళనాడు లో విక్రమ్ గత చిత్రం ‘తంగలాన్’ కి మొదటి రోజున 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, ‘వీర ధీర శూర’ చిత్రానికి మూడు రోజులకు కలిపి కూడా 12 కోట్ల గ్రాస్ వసూళ్లు రాలేదు. ట్రేడ్ కి ఇది పెద్ద షాక్. ఓపెనింగ్స్ దెబ్బ పడినప్పటికీ, పబ్లిక్ లో మౌత్ టాక్ మంచిగా ఉండడంతో లాంగ్ రన్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో అజిత్(Thala Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం విడుదలైంది.
Also Read : హృతిక్ రోషన్ కంటే నాగ చైతన్య చాలా బెటర్ అంటున్న సమంత..!
అజిత్ తమిళనాడు లో టాప్ 3 స్టార్ హీరోస్ లో ఒకరు. ఆయన సినిమా విడుదల అంటే థియేటర్స్ అన్ని ఆయన చిత్రానికే ఇచ్చేయాలి. పైగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం పై మొదటి నుండి అంచనాలు పీక్ రేంజ్ లో ఉండేవి. అంత అంచనాల నడుమ, ఒక సూపర్ స్టార్ సినిమా వస్తే ఇక విక్రమ్ సినిమాని ఎందుకు ఉంచుతారు. అన్ని థియేటర్స్ నుండి తీసేసి కేవలం చెన్నై సిటీ మొత్తానికి కలిపి 12 షోస్ మాత్రమే కేటాయించారు. నిజానికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం విడుదల లేకపోయుంటే ‘వీర ధీర శూర’ కి మరో రెండు వారాల థియేట్రికల్ రన్ ఉండేది. కానీ విక్రమ్ అదృష్టం ఆ రేంజ్ లో ఉంటే ఏమి చేస్తాము. చివరికి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ గానే మిగిలింది. ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
తమిళనాడు లో ఈ చిత్రానికి క్లోజింగ్ లో 42 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండు కోట్ల ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రానికి ఇంత గ్రాస్ వచ్చిందంటే లాంగ్ రన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్ల 40 లక్షలు, ఓవర్సీస్ నుండి 17 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా క్లోజింగ్ లో ఈ చిత్రానికి 68 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కేవలం రెండు కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది. అజిత్ సినిమా లేకపోతే సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.