Samantha Ruth Prabhu : వయసు వెనక్కి మళ్ళిస్తున్న సమంత.. ఆ ఫొటోలు వైరల్

మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. దాని నివారణకు మందులు వాడుతున్నప్పటికీ.. ఆమె శరీరంలో కించిత్ కూడా మార్పు రాకుండా చూసుకుంటున్నది అంటే మామూలు విషయం కాదు. చేతికి సెలైన్ తో యశోద, శాకుంతలం వంటి సినిమాల్లో నటించిన సమంత.. ఖుషి సినిమాలో కొంత యాక్టివ్ గానే కనిపించింది. అందులో విజయ్ తో నటించిన కొన్ని సన్నివేశాలు సమంతలో మరో కోణాన్ని చూపించాయి.. ఆ సినిమా తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. దీనికి రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు దర్శకత్వం వహించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో సమంత నటించింది. అందులో కొన్ని సన్నివేశాలలో సమంత రెచ్చిపోయిందనే టాక్ ఉంది.

Written By: NARESH, Updated On : March 9, 2024 9:46 pm
Follow us on

Samantha Ruth Prabhu : రోజులు గడుస్తున్నా కొద్దీ వయసు మళ్ళుతుంది. శరీరంలో మార్పులు వస్తాయి. వీటికి ఎవరూ అతీతం కాదు. అయితే ఈ విషయంలో సమంతకు దేవుడు మినహాయింపు ఇచ్చాడు కావచ్చు. ఎందుకంటే ఆమె రోజులు గడుస్తున్నా కొద్దీ మరింత యంగ్ అయిపోతోంది. అప్పుడప్పుడు విడుదలైన ఏం మాయ చేసావే సినిమాలో జెస్సి పాత్రలో ఎలా ఉందో.. ప్రస్తుతం కూడా అలాగే ఉంది. పైగా తనలో ఉన్న అందాన్ని మరింత ఇనుమడింపజేసే కసరత్తులు చేస్తోంది.

మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. దాని నివారణకు మందులు వాడుతున్నప్పటికీ.. ఆమె శరీరంలో కించిత్ కూడా మార్పు రాకుండా చూసుకుంటున్నది అంటే మామూలు విషయం కాదు. చేతికి సెలైన్ తో యశోద, శాకుంతలం వంటి సినిమాల్లో నటించిన సమంత.. ఖుషి సినిమాలో కొంత యాక్టివ్ గానే కనిపించింది. అందులో విజయ్ తో నటించిన కొన్ని సన్నివేశాలు సమంతలో మరో కోణాన్ని చూపించాయి.. ఆ సినిమా తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. దీనికి రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు దర్శకత్వం వహించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో సమంత నటించింది. అందులో కొన్ని సన్నివేశాలలో సమంత రెచ్చిపోయిందనే టాక్ ఉంది.

చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇటీవల ఓ ఈతకొలనులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వాటిని మర్చిపోకముందే అధునాతన దుస్తులు ధరించి సమంత ఒక ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తను ఇంతవరకు దాచిన గ్లామర్ ను ఈ ఫోటోల ద్వారా చూపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.