https://oktelugu.com/

Harsha Sai: ఈయన యూట్యూబర్ నా? అమ్మాయిల సరసకుడా? హర్షసాయిపై ఫిర్యాదుల వెల్లువా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కొత్త నటులు వాళ్ల ప్రతిభను చూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే మరి కొంతమంది నటులు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే తమను తాము ప్రూవ్ చేసుకోవాలని ఇక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు చాలామంది నటులు, నటీమణులు ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇక్కడికి వచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 / 10:06 AM IST

    Harsha Sai(1)

    Follow us on

    Harsha Sai: ఈరోజుల్లో చాలామంది సోషల్ మీడియా ద్వారా గాని సినిమాల ద్వారా గాని ఫేమస్ అవుతున్నారు. అయితే వాళ్ళు ఫేమస్ అయి మంచి పొజిషన్ కి వచ్చిన వెంటనే చాలా రకాల కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా లేడీస్ ని ఇబ్బంది పెడుతున్నారంటు చాలా మంది సెలబ్రిటీల మీద పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక రీసెంట్ గా జానీ మాస్టర్ తన అసిస్టెంట్ ని శారీరకంగా వేధించాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఇక ప్రముఖ యూట్యూబర్ అయిన హర్ష సాయి కూడా ఒక అమ్మాయి ని వాడుకున్నాడు అంటూ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కొత్త నటులు వాళ్ల ప్రతిభను చూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే మరి కొంతమంది నటులు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే తమను తాము ప్రూవ్ చేసుకోవాలని ఇక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు చాలామంది నటులు, నటీమణులు ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇక్కడికి వచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ప్రముఖ యూట్యూబర్ గా పేరు గాంచిన హర్ష సాయి గురించి మనందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈయన ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అని ఆమె హర్ష సాయి పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఇక ప్రస్తుతం ఆమెను హర్ష స్థాయి అనుచరులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పదజాలంతో చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె సైబరాబాద్ క్రైమ్ లో తెలియజేసింది. ఇక అలాగే తనను ఇబ్బంది పెడుతున్న కొంతమంది వ్యక్తుల యొక్క స్క్రీన్ షాట్లని పోలీసులకు సబ్మిట్ చేస్తూ వాళ్ల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని కోరింది. ఇక దీనికంతటికీ హర్ష సాయి కారణమని ఆయన వెనుక నుండి అందర్ని ఉసిగొలిపి తనని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాడు అంటూ ఆమె ఆ ఫిర్యాదులో తెలియజేసింది.

    మరి మొత్తానికైతే ఇప్పుడు హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక మొత్తానికైతే ఆయన చాలా రోజుల పాటు యూట్యూబర్ గా చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.అయినప్పటికీ ఆయన మీద ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ అయితే కలిగింది. దీంతో ఆయన ‘మెగా లో డాన్’ అనే ఒక సినిమాని కూడా తన స్వీయ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యాడు.

    ఇక దానికి సంబంధించిన ఒక చిన్న టీజర్ ని కూడా రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ప్రస్తావన ఏది బయటికి రాకపోయినప్పటికీ కొంతమంది అమ్మాయిలు మాత్రం హర్ష సాయి తమను శారీరకంగా వేధిస్తున్నాడు అనే ఆరోపణలైతే వస్తున్నాయి.

    ఇక అందులో ఒక అమ్మాయి ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వల్ల హర్ష సాయి మరొకసారి వార్తల్లో నిలవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మొత్తానికైతే ఆయన చేసే సినిమా మీద ప్రతి ప్రేక్షకుడు అటెన్షన్ తో ఉన్నప్పటికీ మధ్యలో ఇలాంటివి జరగడం వల్ల ఆయన మీద ఉన్న ఇంప్రెషన్ అయితే పోతుంది. మరి ఈ కేసులో ఆయన తప్పేమీ లేదని నిరూపించుకుంటాడా లేదంటే మిస్టేక్ చేశానని ఒప్పుకుంటాడా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది..