
Samantha Ruth Prabhu: అన్ని బాగుంటే నేడు చైతు – సామ్ వివాహ వార్షికోత్సవంలో సంతోషంగా గడుపుతూ ఉండేవారు. ఇదే రోజు వాళ్ళు పెళ్లితో ఒక్కటయ్యారు. వారి వివాహం జరిగి నేటితో సరిగ్గా నాలుగేళ్లు అవుతుంది. అయితే రెండు సంప్రదాయాల్లో ఘనంగా జరిగిన వారి వివాహం నాలుగేళ్లలోనే ముగింపు పలకడం బాధాకరమైన విషయం. అయితే గత ఏడాది తమ పెళ్లి రోజు సందర్భంగా సోష మీడియాలో సమంత పెట్టిన మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా గత ఏడాది సమంత(Samantha Ruth Prabhu) తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన మెసేజ్ ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్” అంటూ నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని సమంత అప్పుడు పోస్ట్ చేసింది. నిజంగా ఈ మాటలో ఎంత అర్ధం ఉంది. రెండు జీవితాలు ఘాడంగా ఒక్కటై ఒకే ఆలోచనతో, ఒకే అనుభూతితో ప్రయాణం చేస్తోన్న ఫీలింగ్ ను కలిగించింది ఈ పోస్ట్.
అందుకే, ఇప్పుడు ఈ మెసేజ్ అభిమానులు గుర్తుతెచ్చుకుని మరీ వైరల్ చేస్తున్నారు. సామ్ – చై విడిపోవటం పై ఫ్యాన్స్ ఆవేదన వ్యక్త పరుస్తూ ఎమోషనల్ పోస్ట్ లు పెడున్నారు. ఫ్యాన్స్ ఇంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం చాలా ప్రేమ జంటలు, చై – సామ్ జంటను ఓన్ చేసుకున్నాయి. అందుకే, వాళ్లు విడిపోవడాన్ని జీర్ణయించుకోలేకపోతున్నారు.
కొందరైతే ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారు ? మీకు సున్నితమైన మనసులు ఎందుకు మొద్దు బారాయి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక సమంత అభిమానులు అయితే ‘తిరిగి మీరిద్దరూ కలిసిపోవాలి, ఎప్పటికైనా మీరు మళ్ళీ కలిసిపోతారని నమ్ముతున్నాం’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
అయితే, ఈ మెసేజ్ మాత్రం ఫ్యాన్స్ కి చాలా బాధను కలిగిస్తోంది. ఇంతకీ ఏం మెసేజ్ అంటే అది.. ‘మీ మధ్య హద్దులు లేని ప్రేమ, ఇప్పుడు ఎందుకు అంతు లేని దూరంగా మారింది ?. ఏది ఏమైనా సామ్ -చై ఎందుకు విడిపోయారో వారికీ మాత్రమే తెలుసు.
ఇక విడాకుల తరువాత సమంత తొలి సారి ముకరంజా జానియర్ కాలేజీలో జరిగిన ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక షూట్ గ్యాప్‌లో ఆమె తీవ్ర భావేద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. విడాకుల ఆలోచనతో సమంతను బాగా కుంగిపోయినట్లు కనిపించింది.