https://oktelugu.com/

తన సీక్రెట్స్ చెప్పుకొచ్చిన సమంత !

అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మేన్ 2’తో మరోసారి తన నటనా చాతుర్యాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద విచ్చలవిడిగా ప్రదర్శించింది. దాంతో సమంతను అభిమానులతో పాటు సినీ ప్రముఖలు కూడా సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. వాస్తవానికి నేను అసలు నటి అవుదామనుకోలేదు, కానీ పరిస్థితుల ప్రభావం, అవసరాల వల్ల సమంత […]

Written By:
  • admin
  • , Updated On : June 8, 2021 / 03:55 PM IST
    Follow us on

    అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మేన్ 2’తో మరోసారి తన నటనా చాతుర్యాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద విచ్చలవిడిగా ప్రదర్శించింది. దాంతో సమంతను అభిమానులతో పాటు సినీ ప్రముఖలు కూడా సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

    వాస్తవానికి నేను అసలు నటి అవుదామనుకోలేదు, కానీ పరిస్థితుల ప్రభావం, అవసరాల వల్ల సమంత నటిగా మారిందట. ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిందట. ఆ సమయంలో తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఉద్దశ్యంతో తనకు ఇష్టం లేకపోయినా చాలా జాబ్స్ చేశాను అంటూ, ఆ జాబ్స్ లో ఒకటి మోడలింగ్ అంటూ సమంత చెప్పుకొచ్చింది.

    ఆర్ధిక అవసరాల కోసం అలా మోడలింగ్ లోకి వచ్చిన సమంత, ఆ తరువాత అనుకోకుండా యాక్టింగ్ వైపుకు వచ్చిందట. ఇండస్ట్రీలో తనకు ఎవ్వరూ గాడ్ ఫాదర్స్ లేకపోయినా అదృష్టం కలిసి వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటూ సమంత తెలియజేసింది. సమంత చెన్నైలో చదువుకుంది, ఆమె స్కూల్ లో క్లాస్ టాపర్ కూడా. ఒక విధంగా సమంతలోని ఆ తెలివితేటలు వల్లే ఆమె పర్సనల్ లైఫ్ ను కూడా చాల బాగా ప్లాన్ చేసుకుంది.

    ఇక సమంత బిజినెస్ లోనూ ప్రవేశించింది. ఆమె ప్రత్యేకంగా ఓ ఫ్యాషన్ బొటిక్ ను మొదలుపెట్టింది. సమంత ఫ్యాషన్ బ్రాండ్ పేరు సాకి. ఫ్యాషన్ బొటిక్ లో ఏదో పెట్టుబడి పెట్టి వదిలేయకుండా, తానే అన్ని విషయాలను చూసుకుంటూ.. తన మనసుకు నచ్చిన బ్రాండ్స్ ను మాత్రమే తన ఫ్యాషన్ బోటిక్ లో ఉంచుతుంది. ఈ ఫ్యాషన్ బోటిక్ లో సమంత కలెక్షన్ కూడా ఉంది. అన్నట్టు సమంతకు ప్రత్యూష ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థ కూడా ఉంది.