https://oktelugu.com/

ఏపీలో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకా

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మూడో దశ వస్తే ఎదుర్కొనే ఉద్దేశంతోనే ముందస్తుగా అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నట్లు సింఘాల్ తెలిపారు. కరోనా వైరస్ మూడో దశ కనుక తీవ్రంగా ఉండి ఆసుపత్రులలో చేరాల్సి వస్తే పిల్లలకు సాయంగా ఉండాల్సింది తల్లులేనని, కాబట్టి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 8, 2021 3:42 pm
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మూడో దశ వస్తే ఎదుర్కొనే ఉద్దేశంతోనే ముందస్తుగా అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నట్లు సింఘాల్ తెలిపారు. కరోనా వైరస్ మూడో దశ కనుక తీవ్రంగా ఉండి ఆసుపత్రులలో చేరాల్సి వస్తే పిల్లలకు సాయంగా ఉండాల్సింది తల్లులేనని, కాబట్టి వారికి తొలుత టీకా ఇవ్వాలని ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసిందని, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింఘాల్ తెలిపారు.