Pawan Kalyan – MaheshBabu : సౌత్ ఇండియాలనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకున్న నటి సమంత.కుర్ర హీరోల దగ్గర నుండి , స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరితో ఈమె సౌత్ లో సినిమాలు చేసేసింది.వాటిల్లో ఎక్కువ శాతం విజయం సాధించిన సినిమాలే ఉండడం విశేషం .కేవలం హీరోల పక్కన ఆడిపాడే హీరోయిన్ల పాత్రలు మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి కూడా సూపర్ హిట్స్ ని అందుకుంది.

అయితే ఆమెకి చిన్నగా హీరోయిన్ రోల్స్ మీద మోజు పొత్తు వస్తుంది.చేస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, లేదంటే నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.అంతే కాదు విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా ఈమె ఏమాత్రం వెనకడుగు వెయ్యడం లేదు, కొంతకాలం క్రితం అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ లో ఆమె పోషించిన నెగటివ్ రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.దీనితో ఈమెకి హిందీ వరుసగా ఆఫర్ల వర్షం కురిసింది.

ప్రస్తుతం ‘సితా డెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత, తెలుగులో విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రం చేస్తుంది.ఇది ఇలా ఉండగా సమంత లేటెస్ట్ గా తనకి వచ్చిన రెండు బంగారం లాంటి అవకాశాలను వదులుకుందని ఫిలిం నగర్ లో ఒక టాక్ జోరుగా వినిపిస్తుంది.సమంత వయస్సులో ఉన్న హీరోయిన్లకు మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ రోల్ రావడం అనేది ఒక వరం లాంటిది.కానీ తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లెకపొయ్యేసరికి వదిలేసుకుందట.పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో ఒక హీరోయిన్ గా సమంత ని అడిగారట, కానీ ఆమె నో చెప్పింది.

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా మొదటి హీరోయిన్ గా తొలుత సమంతానే అడిగారట.కానీ ఆమె ఒప్పుకోకపొయ్యేసరికీ పూజ హెగ్డే ని తీసుకున్నారట, ఇందులో శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అలా సమంత టాలీవుడ్ టాప్ 2 హీరోల సినిమాలను మిస్ చేసుకొని పెద్ద పొరపాటు చేసిందా అని ఆమె అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.