
Two Reptiles : సరీసృపాల జాతికి చెందిన రెండు మొసళ్ళు కొట్టుకోవడం, అది కూడా ఇద్దరు మనుషులు పోట్లాడుకున్నట్టు పోట్లాడుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? ఇటువంటి దృశ్యం కోల్ కతా ఐఐఎం లో చోటుచేసుకుంది.. ఈ వీడియో వాట్సాప్ గ్రూప్ లో రావడంతో సుశాంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోను చూసి నెటిజెన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.. రెండు బల్లులు పరస్పరం పోట్లాడుకుంటున్నాయని కొందరు అంటుంటే.. కొమొడో, మొసలి పరస్పరం పోరాడుతున్నాయని? ఈ పోరులో ఎవరు గెలిచారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. సాధారణంగా మొసల్లు అలా నిటారుగా నిలబడి కొట్టుకోవని, ఇదంతా కల్పితమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి మొసళ్ళు సరిసృపాల జాతికి చెందినవి.. వీటికి పాకడం తప్ప నిటారుగా నిలబడటం రాదు. అయితే కొమొడో జాతుల్లో మాత్రం కొన్ని పాకుతాయని జీవశాస్త్ర అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇక మొసళ్ళ విషయానికి వస్తే వాటి కాళ్ళ కింద నిర్మాణాలు చాలా దృఢంగా ఉంటాయి.. అవి ఎక్కువసేపు నిలబడేందుకు సహకరించవు. ఒకవేళ ఏదైనా ఆధారం ఉన్నప్పటికీ వాటి ఉదరం కింద శ్లేష్మం ఉండటంవల్ల జారుతూ ఉంటుంది. మరి ఐఐఎం కోల్కతా లో అలా నిటారుగా నిలబడినవి మొసళ్ళేనా? అనేది ఇప్పుడు అంతు చిక్కకుండా ఉంది. ఇక సుశాంత నంద ను వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన వీడియో కాబట్టి.. ఇది ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉంటారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మరో వైపు నిత్యం విద్యార్థులతో కళకళలాడే ఐఐఎం కోల్ కతా లో రెండు మొసళ్ళు కొట్టుకోవడం ఎప్పుడూ చూడలేదని అక్కడివారు చెబుతున్నారు.
Learning to manage conflicts🤔
Early morning scene from IIM Kolkata…
( As received in WA) pic.twitter.com/6jXGYkWQyA— Susanta Nanda IFS (Retd) (@susantananda3) March 1, 2023