Homeఎంటర్టైన్మెంట్Samantha- Koffee With Karan Show: అవకాశం వస్తే నాగ చైతన్య ని చంపేస్తాను -...

Samantha- Koffee With Karan Show: అవకాశం వస్తే నాగ చైతన్య ని చంపేస్తాను – సమంత

Samantha- Koffee With Karan Show: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచుకున్న సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకొని దాదాపుగా సంవత్సరం పైనే అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఏం మాయ చేసావే సినిమా తో పరిచయమైనా ఈ ఇద్దరి స్నేహం ఆ తర్వాత ప్రేమ గా మారి నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షం లో పెళ్లి కూడా చేసుకున్నారు..నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోయంగా సాగిన వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఇలా అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోతుంది అని కలలో కూడా ఎవ్వరు ఊహించలేదు..వీళ్లిద్దరు విడిపోయారు అనే విషయం ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేకపోతున్నారు అనడం లో ఏ మాత్రం అతిశయం లేదు..విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారి చూసుకున్నారు..సమంత మరియు నాగచైతన్య వరుస సినిమాలతో బాగా బిజీ అయిపోయారు..ఏనాడు కూడా వీళ్లిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేదానిపై మాట్లాడలేదు..ఒకరి మీద ఒకరు విమర్శలు కూడా చేసుకోలేదు..కానీ లేటెస్ట్ గా సమంత ఒక పాపులర్ టాక్ షో లో నాగ చైతన్య గారి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో వైరల్ గా మారాయి..సమంత కి నాగ చైతన్య మీద ప్రస్తుతం ఈ రేంజ్ కోపం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్లు.

Samantha- Koffee With Karan Show
Samantha- Koffee With Karan Show

ఇక అసలు విషయానికి వస్తే హిందీ లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ అనే ప్రోగ్రాం కి ఎలాంటి ఆదరణ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ ప్రోగ్రాం లో ఎంతో మంది సెలెబ్రిటీలు వచ్చి తమ జీవితం లో చోటు చేసుకున్న అరుదైన సంఘటనలు ఎలాంటి దాపరికం లేకుండా పంచుకుంటుంటారు..ప్రస్తుతం ఈ షో డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది..ఈ షో లో ఇటీవల దక్షణాది కి సంబంధించిన సెలెబ్రిటీలు ఎక్కువగా హాజరు అవుతున్నారు.

Also Read: Dhee Show: ఢీ షో లో రగడ..హైపర్ ఆది పై చెయ్యి చేసుకోబోయిన కంటెస్టెంట్..వైరల్ అవుతున్న వీడియో

Samantha- Koffee With Karan Show
Samantha- Koffee With Karan Show

లేటెస్ట్ సమంత కూడా హాజరు అయ్యింది..అయితే ఇందులో కరణ్ జోహార్ ‘నిన్ను నీ మాజీ భర్త ని ఒక్కే రూమ్ లో ఉంచితే ఎలా ఉంటుంది’ అని అడిగిన ప్రశ్నకి సమంత సమాధానం చెప్తూ ‘నన్ను నా మాజీ భర్త ని ఒక్కే రూమ్ లో ఉంచితే, ఆ రూమ్ లో పదునైన వస్తువులు ఏమి లేకుండా చూసుకోవాలి ఎవరైనా..లేకపోతే వాటితో అతనిని చంపినా చంపేస్తాను..భవిష్యత్తులో మేము స్నేహపూర్వకంగా మెలగొచ్చు ఏమో నాకు తెలీదు కానీ..ప్రస్తుతం మాత్రం మమల్ని ఒక్కే రూమ్ లో ఉంచితే జరిగేది అదే’ అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..నాగ చైతన్య మీద ఇంత పగ పెంచుకుందా అంటూ సోషల్ మీడియా నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.

Also Read:68th National Film Awards: జాతీయ అవార్డుల విజేతలు వీరే.. సత్తా చాటిన తెలుగు సినిమాలు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular