Homeఎంటర్టైన్మెంట్ఎద్దు ప్రేమకు ప్రేమతో సమంత...!

ఎద్దు ప్రేమకు ప్రేమతో సమంత…!


ప్రేమ.. ఈ రెండు అక్షరాల మధ్యే బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఆధారపడి ఉంటాయి. ప్రేమకు కులం, మతం, జాతి అంటూ ఏమి లేవు. అందుకే మూగజీవాల్లో కూడా నిస్వార్ధమైన ఆత్మీయతతో కూడుకున్న ప్రేమను చూస్తుంటాం. ప్రస్తుతం సమంత అలాంటి ప్రేమకు సంబంధించిన ఓ వీడియోను చూసి తెగ ముచ్చట పడుతోంది. నిజానికి ఈ వీడియో ప్రేమకు చిహ్నం అనాలేమో.. అంతగా ఈ వీడియో ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఆ మధ్య ఆవు, ఎద్దు ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆవును యజమాని అమ్మేయడం, ఆవును కొనుక్కున్న వ్యక్తి, ఒక ట్రాలీలో ఆవును తీసుకుని వెళ్తుండగా.. ఆవుకి జోడీ అయిన ఓ ఎద్దు, ఆ ట్రాలీ వెంటే పరిగెత్తి, ఆ ట్రాలీని అడ్డగించి, ఆవు చుట్టే తిరుగుతూ అక్కడే ఉండిపోయింది. ఈ వీడియోలో ఎద్దు ప్రేమ అందర్నీ కదిలిచింది.

Also Read: వకీల్ సాబ్ కి గ్రీన్ సిగ్నల్.. ఫ్యాన్స్ కి ఒరిగేదేమీ లేదు !

కాగా చివరకు ఎద్దు ఎంతకీ వినకపోవడంతో దాని ప్రేమను అర్థం చేసుకున్న యజమాని ఫైనల్ గా ఆవును, ఎద్దును కలిపి ఉంచాడు. ఏమైనా ఈ వీడియోని చూస్తుంటే.. పవిత్ర ప్రేమ, నిజమైన ప్రేమ అనేది మనుషుల మధ్యే కాదు, జంతువుల్లో కూడా ఉంటుంది అని రుజువు అయింది. ఒక్క ఇండియాలోనే ఇలాంటి అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అంటూ ఓ విదేశీయుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా తాజాగా ఈ వీడియోలోని ఎద్దు ప్రేమను చూసిన సమంత.. ఆ ఆవు, ఎద్దుల ప్రేమను చూసి ముగ్దురాలైంది. అందుకే ఈ వీడియోకి సమంత ఓ హార్ట్ సింబల్‌ ను యాడ్ చేసి.. వీడియోని షేర్ చేసింది. దాంతో నెటిజన్లు ప్రస్తుతం ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

సమంత ఈ వీడియోని షేర్ చేసినందుకు ఆమెను అందరూ కామెంట్స్ రూపంలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎంతైనా సమంతలో ఓ భగ్న ప్రేమికురాలు ఉంది కదా, పైగా ప్రేమ విలువ తెలిసిన హీరోయిన్.. దానికి తగ్గట్టుగానే మంచి ప్రేమ కథా చిత్రాల్లో మంచి పాత్రలు పోషించిన హీరోయిన్ అయ్యే.. అన్నిటికీ మించి జంతు ప్రేమికురాలయ్యే.. ఇక ఆ మూగ జీవుల ప్రేమను చూసి సమంత చలించకుండా ఎందుకు ఉంటుంది. తన జీవితంలోనూ ప్రేమకు అత్యున్నత స్థానం ఉందని.. కేవలం ప్రేమ వల్లే నా జీవితం సంతోషమయం అయిందని.. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ సమంత ప్రేమ గురించి చాల లోతుగా చెప్పుకొచ్చింది. ప్రేమ గురించి సమంత ఎంతైనా చెప్పొచ్చు. కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆనందంగా తన జీవితాన్ని గడుపుతోన్న ప్రేమికురాలు కదా. ఇక సమంత ఈ మధ్య ఫ్యాషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular