Samantha Ruth Prabhu : సమంత చాలా కాలంగా హిందూమతం ఆచరిస్తున్నారు. విడాకుల సమయంలో ఆమె ఆధ్యాత్మిక చింతన పాటించారు. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో పలు పుణ్యక్షేత్రాలు సందర్శించారు. హిందూ ధర్మంలో మానసిక ప్రశాంత దొరుకుతుందని సమంత నమ్మకం. సద్గురు జగదీష్ వాసుదేవ్ కి సమంత శిష్యురాలు. ఆయనతో పాటు ట్రావెల్ చేస్తారు. ఆ మధ్య సమంత తెల్ల చీర, జపమాలతో కనిపించారు. ప్రస్తుతం సమంత సద్గురు ఆశ్రమంలో ఉన్నారు. ధ్యానంలో ఉన్న ఫోటోలు షేర్ చేశారు.
ధ్యానం చేస్తున్నప్పుడు మనసులో ఆలోచనల అలజడులు ఉండవని, మానసిక ప్రశాంత దొరుకుతుందని సమంత కామెంట్ చేశారు. సమంత ట్రెడిషనల్ లుక్ వైరల్ అవుతుంది. బై బర్త్ క్రిస్టియన్ అయిన సమంత హిందూ మతాన్ని ఇంతలా ఆచరించడం గొప్ప విషయం. ఆమె క్రిస్టియన్ మతాన్ని కూడా ఆచరిస్తారు. చర్చ్ కి వెళతారు. నాగ చైతన్యతో వివాహం అనంతరం సమంత హిందూ దేవుళ్లను కూడా నమ్మడం, పూజించడం మొదలుపెట్టారు.
మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సమంతకు మంచి మిత్రులు. వారితో పాటు అప్పుడప్పుడూ టూర్స్ కి వెళుతుంటారు. కాగా సమంత ఏడాది పాటు సినిమాల నుండి విరామం తీసుకోనున్నారు. ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు కొంత సమయం ఉండగా మానసికంగా సిద్ధం అవుతున్నారు. అందుకే ఆధ్యాత్మిక మార్గం అనుసరిస్తున్నారు. దీని ద్వారా చికిత్సకు అవసరమైన మనో ధైర్యం లభిస్తుందని ఆమె ఆలోచనగా తెలుస్తుంది.
సమంత ఇటీవల ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో పాల్గొన్నారు. చిత్రీకరణ పూర్తి చేశారు. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. విజయ్ దేవరకొండ హీరో కాగా శివ నిర్వాణ దర్శకుడు. ఇక సిటాడెల్ యాక్షన్ సిరీస్. వరుణ్ ధావన్ మరో కీలక రోల్ చేస్తున్నారు. ఇక మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత ఆ వ్యాధికి చికిత్స తీసుకోనున్నారని సమాచారం. అమెరికాలో సమంత లాంగ్ టైం ఉంటారట. సమంత చికిత్సకు కోటి రూపాయలకు పైనే ఖర్చు అవుతుందని సమాచారం.