Samantha: సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. అందుకే, మళ్ళీ సినిమాల్లో బిజీగా మారడానికి తెగ ప్రయత్నం చేస్తోంది. నాగ చైతన్యతో విడిపోయాక వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. తాజాగా సామ్ ఓ అంతర్జాతీయ చిత్రం సైన్ చేసిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఆ హాలీవుడ్ సినిమాలో సమంత పాత్ర పై ఒక పుకారు బాగా వినిపిస్తోంది.

ఆ సినిమాలో సమంత బైసెక్సువల్ అట. అటు మగవాలతోనూ, ఇటు ఆడవాళ్ళతోనూ లైంగిక సంబంధాలు పెట్టుకుంటుందని.. ఆమెకు ఆ పాత్ర చాలా బాగా నచ్చిందని.. అందుకే సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అయిందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ఛాన్స్ కోసం సమంత బాగానే ప్రయత్నాలు చేసిందట.
నిజానికి చైతు పై కోపంతోనే ఈ సినిమా చేస్తోందట. ‘ఓ బేబీ’ నిర్మాతలు ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో ఒక అంతర్జాతీయ చిత్రం ప్లాన్ చేశారని తెలిసి.. వాళ్లకు తానే స్వయంగా కాల్ చేసి మరీ.. సామ్ ఈ సినిమా చేస్తోంది. చేస్తే చేసింది.. ఇప్పుడు ఈ బైసెక్సువల్ క్యారెక్టర్ చేయడం అవసరమా ? అంటూ సమంత పై ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు.
ముఖ్యంగా మీమ్స్ సృష్టించే వారికి ఇప్పుడు చేతినిండా పని దొరికినట్లు అయింది. సమంత ఫోటోలు పెట్టి.. బైసెక్సువల్ ఫీలింగ్స్ పెట్టి మొత్తానికి సమంతను సోషల్ మీడియా సాక్షిగా బైసెక్సువల్ చేసి పారేశారు. అసలు సామ్ అలాంటి పాత్రలో నటిస్తోందన్న వార్త బాగా కలకలం రేపింది. మరోపక్క అక్కినేని అభిమానులు ఈ విషయంలో తెగ ఫీల్ అయిపోతున్నారు.
Also Read: అక్క ‘లవర్’ చెల్లి బెస్ట్ ఫ్రెండ్… తెగింపంటే ఇదీ!
బంగారం లాంటి చైతూతో విడిపోయింది ఇందుకేనా… చీ ? అంటూ సామ్ ను అడ్డమైన తిట్లు తిడుతూ బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, సమంత అభిమానులు మాత్రం ఇప్పటికైనా ఆమె జీవితాన్ని ఆమెని బతకనివ్వండి.. సమంత తనకు నచ్చింది చేస్తోంది ? దానిలో తప్పు ఏముంది ? ఆమెకు నచ్చింది చేసికోనివ్వండి’ అని సామ్ కి కొంతమంది మద్దతు తెలుపుతున్నారు.
మొత్తమ్మీద సమంత విడాకుల తర్వాత ఐటెం సాంగ్ లతో మొదలుపెట్టి బైసెక్సువల్ పాత్రల వరకు వెళ్ళింది. మరి భవిష్యత్తులో ఇక ఎలా రెచ్చిపోతోందో చూడాలి.
Also Read: Bheemla Nayak: త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అదిరిపోయింది..!