Trivikram: త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు. అవును, త్రివిక్రమ్ లో భయం తొంగి చూసింది. ఇంతకీ ఎవర్నీ చూసి త్రివిక్రమ్ భయపడింది ? జగన్ ప్రభుత్వాన్ని చూసి. ఒక్క త్రివిక్రమేనా ? మొన్న రాజమౌళి కూడా భయపడ్డాడు. జగన్ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో చేస్తోన్న చర్యలు దాదాపు ఫలించినట్లే. అయితే, ఆ చర్యలను ఇండస్ట్రీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో రాజమౌళి, త్రివిక్రమ్ పేర్లు కూడా వినిపించాయి.

న్యూస్ ఛానెల్స్ కూడా వీరిద్దరూ జగన్ చేస్తోన్న పనిని విమర్శించారని హైలైట్ చేశారు. దాంతో న్యూస్ ఛానెల్స్ వేసిన ఆ చిన్న వార్తకు భయపడిపోయిన రాజమౌళి తన టీం చేత మాకు ప్రభుత్వం ఎలాంటి అసంతృప్తి లేదు అని ఒక ప్రకటన వదిలాడు. అయితే, తాజాగా త్రివిక్రమ్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
ఈ సంఘటన పై త్రివిక్రమ్ శైలి మాటల్లోనే చెప్పాలంటే.. ‘జగన్ తో సున్నం పెట్టుకుంటే అన్నం కూడా మిగలదు’. కాబట్టి.. జగన్ ఏమి చేసినా అద్భుతమే. మొత్తానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఇచ్చిన స్ట్రోక్ ప్రభావం సినిమా వాళ్ళ పై బాగా పని చేసినట్టు ఉంది. ఇంతకీ త్రివిక్రమ్ పేరు ఎందుకు వచ్చింది అంటే.. త్రివిక్రమ్ పేరుతో రన్ అవుతోన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

ఆ మెసేజ్ ఏమిటంటే.. “ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను నియంత్రిస్తోంది. సరే. అలాగే, స్కూల్ ఫీజులు, ఆస్పత్రుల్లో ఫీజులు కూడా అంతటా ఒకే తీరుగా ఉండేలా ప్రభుత్వం చూడగలదా? సినిమాల కన్నా అవి కదా జనాలకు కావాల్సింది’ ఇలా సాగింది ఈ మెసేజ్ సారాంశం.
ఆ మెసేజ్ ను ఓ జర్నలిస్ట్ మంత్రి పేర్ని నానితో అన్నారు. ఆయనగారు సమాధానమిస్తూ ‘అయితే, జగన్ గారికి త్రివిక్రమ్ అభిప్రాయం చెబుతాను’ అంటూ ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దెబ్బకు త్రివిక్రమ్ కంగారు పడిపోయాడు. అర్జెంట్ గా తన టీమ్ చేత ఒక మెసేజ్ వదిలాడు.
Also Read: అక్క ‘లవర్’ చెల్లి బెస్ట్ ఫ్రెండ్… తెగింపంటే ఇదీ!
“త్రివిక్రమ్ సోషల్ మీడియాలో లేరు. ఎవరో ఆయన పేరుతో చేసే ట్వీట్లకు ఆయనకు సంబంధం లేదు. త్రివిక్రమ్ కి సంబంధించిన సమాచారం అంతా హారిక హాసిని, ఫార్చూన్ ఫోర్ అనే హ్యాండిల్స్ లో మాత్రమే వస్తాయి. ఇతర కామెంట్స్ ని నమ్మవద్దు,” అంటూ త్రివిక్రమ్ టీమ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇది వ్యవహారం.. మొత్తానికి జగన్ ను చూసి స్టార్ డైరెక్టర్లు కూడా భయపడుతున్నారు అన్నమాట.
Also Read: Bheemla Nayak: త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అదిరిపోయింది..!