Kangana Ranaut: వివాదాల హీరోయిన్ ‘కంగన రనౌత్’ అంటేనే బాలీవుడ్ కి భయం. ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని స్టార్ హీరోల సైతం కంగనా నోరు చూసి భయపడుతూ ఉంటారు. తోటి నటీనటులు అందరూ కంగనా చేతిలో తిట్లు తిన్నవారే. అయితే, ఈ వివాదాల రాణి తాజాగా నాగచైతన్య మీద పడింది. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడం పై కంగనా ఘాటుగా స్పందించింది.

తన ఇన్‌స్టాలో చైతు – సామ్ బంధం పై పోస్ట్ చేస్తూ.. ‘ఏ భార్యాభర్తలు విడాకులు తీసుకున్నా.. దానికి ముఖ్య కారణం మూల కారణం మగాడే అయి ఉంటాడు. వినడానికి ఇది ఒక తీర్పులా అనిపించొచ్చు. కానీ ఇందులోనే నిజం ఉంది. ఎందుకంటే ఆ దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు కనుక. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుండటం బాధాకరమైన విషయం’ అంటూ మహా పతివ్రత లా కంగనా చెప్పుకొచ్చింది.
అయితే ఇంతటితో ఆగితే కంగనా ఎందుకు అవుతుంది. అందుకే, తనదైన శైలిలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ను ఉద్దేశించి పలు కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ‘నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ తన సతీమణి కి విడాకులు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ఓ టాలీవుడ్ హీరో. కానీ ఆ హీరోగారు పెళ్లి కంటే ముందు ఆయన తన సతీమణితో 10 సంవత్సరాల పాటు ప్రేమలో మునిగితేలాడు.
కానీ ఇటీవల ఆ హీరో, విడాకుల నిపుణుడైన బాలీవుడ్ సూపర్ స్టార్ ని కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేశాడు. దాంతో ఆ యంగ్ హీరో మీద కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభావం పడింది. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ మార్గదర్శకత్వంలోనే తన భార్యకు విడాకులు సమర్పించుకున్నాడు సదరు యంగ్ హీరో. నేను ఎవ్వరి గురించి చెబుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా’ అంటూ పోస్ట్ లు పెట్టింది కంగనా.
అయితే అమీర్ ఖాన్ అభిమానులు మాత్రం కంగనా పోస్ట్ లు పై సీరియస్ అవుతున్నారు. ఇది మారదు, దీన్ని ఏమి చేసినా తప్పు లేదు అంటూ కంగనా పై బూతుల వర్ధం కురిపిస్తున్నారు.