Samantha : సమంత(Samantha Ruth Prabhu) నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి చిత్రం ‘శుభమ్'(Subham Movie) ఇటీవలే థియేటర్స్ లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్న సందర్భంగా, సమంత మంచి ఎంజాయ్ మూమెంట్ లో ఉంది. హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి పీక్స్ ని చూసిన సమంత, ఇప్పుడు నిర్మాతగా తొలి అడుగులోనే సూపర్ హిట్ ని అందుకోవడం విశేషం. మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడిని ఎదురుకున్న సమంతకు ఈ విజయం ఎంతో ఉపశమనం ని ఇచ్చిందని అనుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు చూస్తే అభిమానులంటే ఆమెకు ఎంత ఇష్టమో అర్థం అవుతుంది.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!
ఆమె మాట్లాడుతూ ‘అభిమానులు నా దగ్గరకు వచ్చి ఫోటోలు అడిగినప్పుడు వాళ్ళకు నో చెప్పకుండా ఉండలేను. నా తండ్రి చనిపోయిన రోజు నేను చెన్నై లో ఉన్నాను. ఒకపక్క ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ నేను అక్కడికి వెళ్లే ముందు కొంతమంది అభిమానులు నాతో ఫోటోలు దిగడానికి వచ్చారు. మనసులో తండ్రి చనిపోయాడని చెప్పలేనంత బాధ ఉంది. అయినప్పటికీ అభిమానుల కోసం నవ్వుతూ ఫోటోలు దిగాను. నేను అభిమానులకు అంత విలువని ఇస్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అభిమానులు మాత్రమే. వాళ్ళ ప్రేమని నేను వెలకట్టలేను. నేను ఏ బాధలో ఉన్నానో వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ నేను మాత్రం వాళ్లకు నో చెప్పలేదు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె మాట్లాడిన ఈ మాటలు అభిమానుల హృదయాలను టచ్ చేసింది. తమకు ఇంత విలువని ఇచ్చే హీరోయిన్ ని అభిమానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ఆమె సొంత ప్రొడక్షన్ లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న రక్త బ్రహ్మాండ అనే సినిమాలో కూడా ఈమె పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా, రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని చాలా కాలం నుండి వినిపిస్తున్న వార్త. ఒకప్పుడు సమంత రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేసేది కానీ, నాగ చైతన్య తో పెళ్లి తర్వాత కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంది. ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా అదే తరహా కథలను ఎంచుకుంటూ తన మార్క్ ని చూపించాలని అనుకుంటుంది సమంత.
Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత