https://oktelugu.com/

Samantha: మెగా హీరో పై మోజుపడ్డ సమంత..హాట్ కామెంట్స్ తో హల్చల్..ఇంత పిచ్చి ఎక్కడా చూసుండరు!

బాలీవుడ్ లో ఒక పాపులర్ షో కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత, ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో హోస్ట్ పలువురి స్టార్ హీరోల పేర్లు చెప్తూ వీళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటాడు. అప్పుడు రామ్ చరణ్ వంతు రాగానే ఆమె ఆయన్ని 'ఓజీ' అని సంబోదించింది. ఇలాంటి ఎలివేషన్ ఆమె సౌత్ లో ఏ స్టార్ హీరో మీద కూడా ఇవ్వలేదు అనే చెప్పాలి.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 03:25 PM IST

    Samantha(4)

    Follow us on

    Samantha: సౌత్ ఇండియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. పాపులారిటీ పరంగా కూడా ఈమె ఇండియా లోనే నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఆర్మాక్స్ సర్వే ఈ విషయాన్నీ అనేక సార్లు వెల్లడించింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె, ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే సమంత సౌత్ లో ఒక్క ప్రభాస్ తో మినహా దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కానీ ఆమెకు ఏ స్టార్ హీరో మీద కూడా కలగని ఇష్టం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద కలిగింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ లో ఒక పాపులర్ షో కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత, ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో హోస్ట్ పలువురి స్టార్ హీరోల పేర్లు చెప్తూ వీళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటాడు. అప్పుడు రామ్ చరణ్ వంతు రాగానే ఆమె ఆయన్ని ‘ఓజీ’ అని సంబోదించింది. ఇలాంటి ఎలివేషన్ ఆమె సౌత్ లో ఏ స్టార్ హీరో మీద కూడా ఇవ్వలేదు అనే చెప్పాలి.

    ఆ తర్వాత కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి ‘ఓజీ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ టైటిల్ ప్రకటించిన రోజు ఓజీ ట్యాగ్ కోసం రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో సమంత రామ్ చరణ్ ని ప్రత్యేకించి పొగుడుతూ వచ్చేది. అంతే కాదు ఇంస్టాగ్రామ్ లో రామ్ చరణ్ నుండి ఏ పోస్ట్ అప్లోడ్ అయినా మొట్టమొదటి లైక్ సమంత నుండే ఉంటుంది. ఆమెకి ఒకవేళ రామ్ చరణ్ పోస్ట్ తెగ నచ్చితే మాత్రం వెంటనే ఒక సాధారణ అభిమాని లాగా ఆ పోస్ట్ క్రింద కామెంట్స్ పెట్టేస్తుంది. నిన్న రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

    ఈ పాటలోని ఒక చిన్న బిట్ ని కట్ చేసి రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసాడు. దీనికి సమంత కామెంట్స్ చేస్తూ ‘అన్ మ్యాచబుల్’ అని అంటుంది. ఆ తర్వాత మళ్ళీ కామెంట్ చేస్తూ ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇలాంటి ఫార్మల్ డ్రెస్ లో అంత గొప్ప స్టెప్పులు ఎవ్వరూ వేయలేరు’ అని అంటుంది. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. వీళ్లిద్దరు కలిసి ‘రంగస్థలం’ చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఆ చిత్రం ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు సమంత రామ్ చరణ్ పై కురిపిస్తున్న ప్రేమని చూసి అభిమానులు వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కావాలని కోరుకుంటున్నారు.