Maa Inti Bangaram Collections: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నేడు గ్రాండ్ గా తెలుగు , తమిళ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు సమంత పడిన కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కిందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో ఆమె ప్రధాన పాత్ర పోషించడం మాత్రమే కాదు , నిర్మాతగా కూడా వ్యవహరించింది. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈమె చేసిన ప్రొమోషన్స్ మేకర్స్ కి ఒక కేసు స్టడీ లాంటిది. ఆ ప్రొమోషన్స్ తాలూకు ఫలితం స్పష్టంగా నేడు కళ్ళముందు కనిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి సెన్సేషనల్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 7 వేల నుండి 10 వేల టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి, ఇది సాధారణమైన విషయం కాదు.
ఇక ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా మ్యాట్నీ షోస్ వరకు నమోదైన గ్రాస్ దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని , కేవలం డొమెస్టిక్ మార్కెట్ నుండి ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని , ఓవర్సీస్ కూడా కలుపుకుంటే 15 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు ఈమధ్య కాలం లో రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఊపు చూస్తుంటే ఈ చిత్రం వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పెద్ది’ చిత్రం సక్సెస్ తో బయ్యర్స్ లో మంచి ఉత్సాహం వచ్చింది.
ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి నేడు నమోదు అవుతున్న ఓపెనింగ్స్ ని చూస్తుంటే , టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మళ్లీ ట్రాక్ లో పడ్డట్టుగా అనిపిస్తోంది. ఇదే ఊపు ని లాంగ్ రన్ లో కూడా కొనసాగిస్తే , ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడి నుండి సమంత మరియు మూవీ టీం చేసే ప్రమోషనల్ ఈవెంట్స్ ఆధారంగా కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్ ఉంటుంది. ఓవరాల్ గా సమంత నిర్మాతగా రెండవసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన మొదటి చిత్రం ‘శుభం’ కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
