Samantha: సమంత చైతన్యతో తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సినిమాల పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరుస సినిమాలను అంగీకరిస్తూ అవసరం అయితే బోల్డ్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది. అయితే.. సమంత తన తర్వాతి సినిమా గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏ సినిమా గురించి అంటే.. సామ్, విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి చేస్తున్న సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుందని సమంత చెప్పుకొచ్చింది. పైగా ఈ సినిమా కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు సామ్ చెప్పింది. ఈ సినిమాలో సమంత – నయనతార పోటీ పడి నటించారట. వీరితో పాటు ఎలాగూ విజయ్ సేతుపతి కూడా పోటీ పడి ఉంటాడు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఎమోషన్స్ లో పట్టుకోవడంలో దిట్ట.

కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ సేతుపతి హీరో, సమంత – నయనతార హీరోయిన్లు.. నిజంగా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదే. ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా రాబోతుంది అంటే… ఇక ఆ సినిమాకి ఉండే క్రేజే వేరు. అందుకే.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాకి నయనతారనే నిర్మాత. పైగా ఆమెకు కాబోయే భర్త ఈ సినిమాకి దర్శకుడు. అన్నిటికీ మించి ఈ సినిమాలో సమంత విలన్ గా నటిస్తోంది. ఒకవిధంగా ఈ సినిమాతోనే సమంత తన సినీ కెరీర్ లో సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తోంది.
మరి ఈ సినిమా సూపర్ హిట్ అయితే.. సామ్ కి ఇంకా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మరెన్నో వైవిధ్యమైన పాత్రలు వస్తాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యూనరేషన్ పెంచేసింది. అలాగే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ రేట్లు కూడా రెట్టింపు చేసేసింది. మొత్తమ్మీద సామ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది.